గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీడీఏ ఏపీ) గుంటూరు మెడికల్ కాలేజ్(జీఎంసీ) గుంటూరు యూనిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జీజీహెచ్‌లో సీనియర్ వైద్యులు అరగంట సేపు ఓపీ వైద్య సేవలు నిలిపివేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం 2016 నుంచి తమకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలన్నారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్‌కాంత్, గుంటూరు అధ్యక్షుడు డాక్టర్ బి.దేవకుమార్, యూనియన్ నేతలు డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ అజయ్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ వాసవి, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ శివగోపాల్, డాక్టర్ తబిత పాల్గొన్నారు.


