అభివృద్ధితో పాటు వృక్ష రక్షణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధితో పాటు వృక్ష రక్షణకు ప్రాధాన్యం

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

అభివృద్ధితో పాటు వృక్ష రక్షణకు ప్రాధాన్యం మంగళగిరి టౌన్‌: అరణ్యారామం ప్రాంతంలో అభివృద్ధి పనులతో పాటు పచ్చదనం పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ గ్రీన్‌ సొసైటీ చైర్మన్‌ కొణిదెల నాగేంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోని అరణ్యారామం ప్రాంతాన్ని శనివారం అధికారులతో కలసి నాగేంద్రబాబు సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు 45 చెట్లను తరలించినట్లు అధికారులు ఆయనకు వివరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా వృక్ష సంపదను కాపాడేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు. అనంతరం అరణ్యారామం లే అవుట్‌ ప్రణాళికలు, ప్రతిపాదిత అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నందనవనం ప్రాంతాన్ని సందర్శించి వేప, రావి చెట్లను నాటారు. రాష్ట్రంలో యాభై శాతం గ్రీన్‌ కవర్‌ సాధించాలనే లక్ష్యానికి పరిశ్రమలు, ఇతర సంస్థలు సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా భాగస్వాములు కావాలని సూచించారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ , హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌ డాక్టర్‌ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌డీఏ సీఈఓ బీఎన్‌ఎన్‌ మూర్తి, సీసీఎఫ్‌ గుంటూరు శ్రీనివాసులు రెడ్డి, సీసీఎఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ అండ్‌ హెచ్‌ఆర్‌డీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. విలక్షణ రచయిత ఆదినారాయణ

కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జిలు ధరించి మానవ హారంలా నిలబడి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో కాంట్రాక్టు ఉద్యోగులు ఈనెల 21 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన కార్యక్రమంలో నర్సింగ్‌ సిబ్బంది రమాదేవి, మనీషా, రేణుక, హైమావతి, భార్గవి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శైలజ, మోహన్‌, ఖాశిం, బ్రహ్మం, ఫార్మశిస్టులు శ్రీలక్ష్మీ, నాగుల్‌మీరా, సౌజన్య, అశ్వని పాల్గొన్నారు.

నగరంపాలెం: తెలుగు భాషా పరిశోధన, బాలసాహిత్యం, పాఠ్య గ్రంథాలు, వచన సాహిత్యం తదితర ప్రక్రియల్లో ఎనభైకిపైగా రచనలు చేసి తనదైన ముద్ర వేసిన విలక్షణ రచయిత కవి డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య హాస్టల్‌ సమావేశ మందిరంలో డాక్టర్‌ నాగభైరవఆదినారాయణ రాసిన ఆధ్యక్షరం గ్రంథావిష్కరణ, అంకితోత్సవ సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన కవి రచయిత డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. డాక్టర్‌ సిహెచ్‌ సుశీలమ్మ, డాక్టర్‌ గుమ్మ సాంబశివరావు గ్రంథ సమీక్ష గావించారు. ఆద్యక్షరం తొలి ప్రతి గ్రంథాన్ని డాక్టర్‌ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, లక్ష్మీ అన్నపూర్ణమ్మ దంపతులకు అందించారు. డాక్టర్‌ ఆదినారాయణ, కౌసల్య దంపతులను డాక్టర్‌ శ్రీకృష్ణమూర్తి దంపతులు నూతన వస్త్రాలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement