తాడికొండ: న్యాయాన్ని అందరికీ చేరువ చేయడం, రాజ్యాంగ విలువల పరిరక్షించడం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మెంబర్ సెక్రటరీ(డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి) న్యాయమూర్తి బీఎస్‌వీ హిమబిందు అన్నారు. వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లా నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని, కొత్తగా చేరిన న్యాయ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ శనివారం ఉత్సాహభరితమైన ఫ్రెషర్స్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి హిమబిందు మాట్లాడుతూ న్యాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు న్యాయ వ్యవస్థలోని ఆచరణాత్మక, సామాజిక అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. సమాజంలోని అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం అందించడంలో న్యాయ సేవలు, న్యాయ సహాయం(లీగల్ ఎయిడ్‌ను) పోషించే కీలక పాత్రను ఆమె వివరించారు. వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయ వైస్–చాన్సలర్ డాక్టర్ పి.అరుళ్మొళి వర్మన్ మాట్లాడుతూ భవిష్యత్ న్యాయ నిపుణులను తీర్చిదిద్దడంలో నాణ్యమైన విద్య, విస్తృత పరిశోధన, నైతిక విలువలతో కూడిన న్యాయ ఆచరణకు ప్రాధాన్యం ఇస్తూ, స్కూల్ ఆఫ్ లా కోసం విశ్వవిద్యాలయం నిర్దేశించుకున్న దార్శనికతను ఆయన వివరించారు.
న్యాయమూర్తి హిమబిందు


