సంక్షేమ పథకాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలపై అవగాహన

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

గుంటూరు లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం సాంఘిక సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలాచూడాలని కోరారు.

జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయికుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి.దుర్గాభవాని మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు, భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ప్యానెల్‌ అడ్వకేట్‌ కె.కాళిదాసు మాట్లాడుతూ నల్సా పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.ఎల్‌.హర్షిత, బార్‌ ప్రెసిడెంట్‌ ఎం.నాగేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎన్‌.వీరమణి, పారా లీగల్‌ వాలంటీర్స్‌, ప్యానెల్‌ అడ్వొకేట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement