గుంటూరు వెస్ట్: నేత్రదానం ఉద్యమంలో పాల్గొనండి, దృష్టి సందేశ దాత అవ్వండని ప్రజలకు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పోస్టర్‌లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నేత్రదానం గురించి, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి సమాజ సంక్షేమ సమితిలో అన్నివిధాలా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలకు చెప్పడం వల్ల ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తుందన్నారు.
నేత్ర దానం చేయడం ద్వారా మరణించిన అనంతరం కూడా ప్రపంచాన్ని మీ కళ్ళు చూస్తాయన్నారు. డీఎంహెచ్‌ఓ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ మరణించిన వ్యక్తి తన నేత్రాలను దానం చేస్తున్నట్టు ఇదివరకే ప్రతిజ్ఞ చేసినా, చేయకపోయినా సరే, ఆ కుటుంబం వారి అనుమతితో కూడా కళ్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, అంధత్వ నివారణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ


