పోలీస్‌ సిబ్బంది సమస్యలకు సత్వరమే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సిబ్బంది సమస్యలకు సత్వరమే పరిష్కారం

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

పోలీస్‌ సిబ్బంది సమస్యలకు సత్వరమే పరిష్కారం ఏపీ గ్రీన్‌ సొసైటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకారం

నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. ప్రతి శుక్రవారంలో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ సిబ్బంది గ్రీవెన్‌న్స్‌ డే నిర్వహించారు. ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. శాఖ నిబంధనలు ప్రకారం త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది సమస్యలు సకాలంలో పరిష్కరిస్తున్నామని హామీ ఇచ్చారు. బదిలీలు, పదోన్నతులు, ఖాళీలు, పరిపాలనా అవసరాల దృష్ట్యా పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తేవాలన్నారు. ప్రతి పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని అన్నారు.

మంగళగిరి టౌన్‌: ఏపీ గ్రీన్‌ సొసైటీ (ఆంధ్రప్రదేశ్‌ సొసైటీ ఫర్‌ గ్రీనింగ్‌ అండ్‌ రీ ఫారెస్టేషన్‌ ఫర్‌ ఎకలాజికల్‌ ఎన్‌రీచ్‌మెంట్‌) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి అరణ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏపీ గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement