జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన

గుంటూరు మెడికల్‌: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రజలకు నేత్రదానం ప్రాముఖ్యతను వివరించి, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ‘కంటికి కన్ను– మీ సంకల్పం కావాలి నేత్రదానం, మనందరికీ ఆదర్శం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరినీ నేత్రదానం వైపు ప్రోత్సహించాలని కోరారు. నేత్రదానం ఒక మహత్తర సామాజిక సేవగా, ప్రజా ఉద్యమంగా మారేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు వచ్చేలా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కృషి చేయాలని డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నేత్రదాన ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement