సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా

జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కారమే అధికారుల ప్రధాన కర్తవ్యం కావాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రతి అర్జీని సిబ్బంది ప్రత్యేకంగా చూడాలన్నారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పరిష్కారం కావాల్సిన సమస్యలు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళుతున్నాయన్నారు. వివిధ శాఖాధికారులు కూడా తమ పరిధిలో ఉన్న అర్జీలు ఎన్ని పరిష్కారం అయ్యాయి. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి కారణాలేంటో తెలుసుకోవాలన్నారు. 314 అర్జీలను డీఆర్‌ఓతోపాటు డీఈఓ డాక్టర్‌ సలీమ్‌ బాషా, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ సత్యనారాయణ, జిల్లా అధికారులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement