నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ప్రధాన లక్ష్యం

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ప్రధాన లక్ష్యం భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ బాల ప్రతిభావంతుడికి తిరంగా గౌరవ్‌ సమ్మాన్‌ అవార్డు తెనాలి: తెనాలికి చెందిన బాల ప్రతిభావంతుడు బండికళ్ల ప్రదీప్‌ నారాయణ్‌ ప్రతిష్టాత్మకమైన మ్యాజిక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తిరంగా గౌరవ్‌ సమ్మాన్‌ అవార్డు–2026కు ఎంపికయ్యాడు. అసాధారణ జ్ఞాపకశక్తికి గుర్తింపుగా మ్యాజిక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఫౌండేషన్‌ ‘మెమరీ అండ్‌ ఎడ్యుకేషన్‌’ (జ్ఞాపకశక్తి, విద్య) విభాగంలో ఈ గౌరవాన్ని ప్రకటించింది. గుడివాడకు చెందిన ప్రదీప్‌ నారాయణ్‌, తెనాలిలోని సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. అయిదేళ్ల వయస్సులోనే విద్యతో పాటు వివిధ అంశాలపై విశేష ఆసక్తి కనబరుస్తూ, తన ప్రతిభను అనేక వేదికలపై ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే, కేవలం 39 సెకన్లలో 60 పక్షి జాతులను గుర్తించడం ద్వారా తన అసాధారణ జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యం, పక్షులపై తనకున్న పరిజ్ఞానాన్ని చాటాడు. భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశానికి గర్వకారణంగా నిలిచే ప్రతిభా వంతులను మ్యాజిక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తిరంగా గౌరవ్‌ సమ్మాన్‌ అవార్డు–2026కు ఎంపికచేశారు. గోవాలో సెప్టెంబరు 18న జరిగే అవార్డు ప్రదానోత్సవంలో చిన్నారి ప్రదీప్‌ నారాయణ్‌ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. తమ కుమారుడి ప్రతిభకు ఇలాంటి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ చిన్నారి తండ్రి రాజేష్‌ అన్నారు.

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి

నరసరావుపేట: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. పల్నాడు సర్కిల్‌ పనితీరుపై విజయవాడ కార్పొరేట్‌ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్‌ లాస్‌ తగ్గింపు, విద్యుత్‌ భద్రత, నిర్వహణ పనులు, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు, పంపిణీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సమీక్షించారు. రెవెన్యూ వసూళ్లలో మెరుగైన ఫలితాలు, విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్‌ ఫైనానన్స్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, డైరెక్టర్‌ టెక్నికల్‌ ఆవుల మురళీకృష్ణయాదవ్‌, డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ టీవీఎస్‌ఎన్‌ మూర్తి, పల్నాడు సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ పి.విజయకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.

తాడికొండ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభభమైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అసెంబ్లీ భవనం, ప్రవేశ ద్వారాలు, అసెంబ్లీ హాల్‌, మండలి హాల్‌, వీఐపీ/వీవీఐపీ మార్గాలు, చెక్‌పోస్టులు తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. బందోబస్తులో భాగంగా డ్రోన్‌ ఆధారిత నిఘా, అధునాతన సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఏటీవీ రవికుమార్‌, ఎస్బీ డీఎస్పీ, అళహరి శ్రీనివాస్‌, ఏఆర్‌ డీఎస్పీ సుంకరయ్య, ఎస్బీ సీఐ మల్లికార్జునరావు, ఏఆర్‌ ఆర్‌ఐ కృష్ణయ్య పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

వచ్చే నెల 18న గోవాలో ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement