తెలంగాణ తరహాలో రూ.2 లక్షల వరకు పంటల రుణమాఫీ చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి చట్టబద్దత ఇవ్వాలి. ఎరువులు, పురుగుమందులు, డీజిల్ ధరలను తగ్గించి సాగు ఖర్చులు నియంత్రించాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. గుంటూరు చానల్‌ను అభివృద్ధి చేయాలి
– కొల్లి రంగారెడ్డి, పుప్పాల సత్యనారాయణ, జవ్వాజి సాంబశివరావు, రెంటాల కుమారి,
జిల్లా రైతు సంఘం నేతలు
అడవి తక్కెళ్ళపాడులో సుమారు 700 మంది రైతులం 1987లో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం ఫ్రీడమ్ ఫైటర్స్‌కు మా భూములు కేటాయించింది. దీనిపై కోర్టును కూడా ఆశ్రయించాం. వివాదంలో ఉన్న ఆ భూమిలో కొందరు నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సమస్యలు తీర్చకపోగా వివాదాలు సృష్టించడం సరికాదు. తక్షణం మాకు న్యాయం చేయాలి. అంత వరకు పోరాటం ఆగదు.
– అడవితక్కెళ్ళపాడు వాసులు


