విజ్ఞాన్‌లో పరిశోధన కేంద్రాలు ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో శాసీ్త్రయ పరిశోధనలకు రెండు అత్యాధునిక పరిశోధనా కేంద్రాల్ని ప్రారంభించినట్లు వైస్ చాన్సలర్ పి. నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. నానో సైన్స్, ఎనర్జీ మెటీరియల్స్, సెన్సార్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘రామన్ సెన్సర్ సెంటర్’’, ‘‘డాక్టర్ లావు రత్తయ్య సెంటర్ ఫర్ ఎనర్జీ మెటీరియల్స్ (డాక్టర్ లారా–సీఈఎం)’’ కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రామన్ సెన్సర్ సెంటర్ ద్వారా నానో సైన్స్‌ను సాంకేతిక అనువర్తనాలుగా మార్చే దిశగా విస్తృత పరిశోధనలు సాగనున్నాయని చెప్పారు. లావు రత్తయ్య సెంటర్ ఫర్ ఎనర్జీ మెటీరియల్స్ ద్వారా ఎనర్జీ సంబంధిత పదార్థాలు, పునరుత్పాదక శక్తి వనరులు, బ్యాటరీ టెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్స్‌పై లోతైన పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్ డాక్టర్ పావులూరు సుబ్బారావు, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, పాల్గొన్నారు.


