బలరామావతారంలో వైకుంఠవాసుడు | - | Sakshi
Sakshi News home page

బలరామావతారంలో వైకుంఠవాసుడు

Dec 28 2025 8:39 AM | Updated on Dec 28 2025 8:39 AM

బలరామ

బలరామావతారంలో వైకుంఠవాసుడు

బలరామావతారంలో వైకుంఠవాసుడు తెనాలిటౌన్‌: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం స్వామివారిని శ్రీ బలరామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి శేషారావుకు జాతీయ స్థాయి ఉత్తమ ప్రకృతి రైతు అవార్డు నడిరోడ్డుపై మొరాయించిన 108 వాహనం ముక్కోటి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

పెదకూరపాడు:జాతీయస్థాయిలో ఉత్తమ ప్రకృతి రైతు అవార్డును కేంద్ర ప్రభుత్వ విభాగం ఆర్‌.సి.ఓ.ఎన్‌.ఎఫ్‌ నుంచి పెదకూరపాడు గ్రామానికి చెందిన దర్శి శేషారావుకు అందించారు. శనివారం గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో జాతీయ ఉత్తమ రైతు అవార్డును శేషారావుకు అందించారు. ఆర్‌.సి.ఓ.ఎన్‌.ఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అజయ్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, ఆ సంస్థ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డాక్టరు వి.ప్రవీణ్‌ కుమార్‌, ఆర్‌.వై.ఎస్‌.ఎస్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ విజయ్‌, కో–ఆర్డినేటర్‌ మల్లేశ్వరి, పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెదకూరపాడు: రోగుల ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్‌ నడిరోడ్డుపై మొరాయించిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో శనివారం జరిగింది. జలాల్‌పురం గ్రామానికి చెందిన మరియమ్మకు ఊపిరి అందకపోవటంతో పెదకూరపాడు సీహెచ్‌సీ నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా గుంటూరు తరలించారు. రోగిని ఆసుపత్రిలో దించి పెదకూరపాడు బయలుదేరిన 108 వాహనం ఎంతకీ స్టార్ట్‌ కాకపోవడంతో రోగి తరఫు కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులతో ముందుకు నెట్టగా ఎట్టకేలకు కదిలింది. అయితే వాహనం పెదకూరపాడు చేరుకునే క్రమంలో పాటిబండ్ల మార్గంలో మరోమారు నిలిచిపోయింది. బ్యాటరీ దిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం 108 వాహనాల రంగులు మార్చి సొబగులు అద్దినప్పటికీ డీజిల్‌ కారటం, బ్యాటరీలు రీచార్జి కాకపోవడం, సీట్లు చినిగిపోయి అధ్వానంగా మారటం, ఎయిర్‌ కండిషనర్‌ సైతం మరమ్మతులకు గురవుతున్నా నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మంగళగిరిటౌన్‌: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30వ తేదీన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి సునీల్‌ కుమార్‌ అధ్యక్షతన ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లపై తహసీల్దార్‌ దినేష్‌ రాఘవేంద్ర, నార్త్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ మురళీకృష్ణ, పట్టణ సీఐ వీరాస్వామిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానికి వాహనాల్లో తరలివచ్చే భక్తులు, వీఐపీల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్‌ వసతి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తొలిసారిగా స్లాట్‌ బుకింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

బలరామావతారంలో  వైకుంఠవాసుడు 
1
1/3

బలరామావతారంలో వైకుంఠవాసుడు

బలరామావతారంలో  వైకుంఠవాసుడు 
2
2/3

బలరామావతారంలో వైకుంఠవాసుడు

బలరామావతారంలో  వైకుంఠవాసుడు 
3
3/3

బలరామావతారంలో వైకుంఠవాసుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement