
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ ఖాసీంబేగ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కొల్లూరు శివప్రసాద్‌రావు, సోషల్‌మీడియా విభాగం అధ్యక్షుడిగా రమేష్‌సాహు, ఐటీ విభాగం అధ్యక్షుడిగా యేరువ ఇన్నారెడ్డిలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
యువజన విభాగం నగర అధ్యక్షుడిగా కోటేశ్వరరావు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగం గుంటూరు నగర అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏటీ కోటేశ్వరావును నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలోని కార్మికులందరూ ఈ– శ్రమ కార్డును కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్డు వలన అత్యవసర సమయంలో వైద్య, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించబడి సహాయం పొందుతారని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకొని, పొందవచ్చని వెల్లడించారు. న్యాయపరమైన సూచనలు చేశారు. తాపీ మేసీ్త్రలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లు, వీధి వ్యాపారులు కార్డుకు అర్హులన్నారు. కార్యక్రమంలో కట్ట కాళిదాసు ప్యానల్ అడ్వకేట్‌లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హనుమత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం