
సంజీవయ్యనగర్ రైల్వే గేటు మూసివేత
నెహ్రూనగర్: సంజీవయ్యనగర్ రైల్వే గేటు వద్ద పైపులైన్ పనుల నిమిత్తం వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం వరకు రైల్వే గేటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి హెచ్‌ఎల్‌ఆర్ (లక్ష్మీపురం) రిజర్వాయర్‌కు తాగునీటిని సరఫరా చేసే 900 ఎంఎం డయా పైపులైన్‌కు నెహ్రూనగర్ పంప్ హౌస్ వద్ద, సంజీవయ్యనగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ పనులు జరగనున్నాయి. ఇవి ఆదివారం నుంచి 2వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గేటు మీదుగా రైల్వే అధికారుల సహకారంతో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. 2వ తేదీ సాయంత్రం ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తయిన తరువాత గేటు తీస్తామని పేర్కొన్నారు.