
సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
నగరంపాలెం: శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం విధులు నిర్వర్తించే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. ‘ఫిట్ ఇండియా– సండ్సే ఆన్ సైకిల్’ ర్యాలీకి ఆదివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీతో పలువురు పోలీస్ అధికారులు సైకిళ్లపై పయనించారు. మూడు బొమ్మల కూడలి మీదగా నగరంపాలెం, మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా కూడలి వరకు వెళ్లి, మరలా జిల్లా పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా ర్యాలీ ద్వారా పోలీస్ అధికార, సిబ్బందిలో చురుకుదనం, ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందిస్తామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధిగా వ్యాయామం, క్రీడలు, సైక్లింగ్ అలవర్చుకోవాలని ఆయన సూచించారు. సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు అరవింద్ (పశ్చిమ), శివాజీరాజు (సీసీఎస్), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్‌బీ సీఐ అలహరి శ్రీనివాస్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.