
తాడేపల్లిలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ట్రాక్టర్ నడుపుతున్న మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి
వినాయక నిమజ్జనం అనగానే ఊరూవాడా సందడే.. సందడి! ఐక్యతకు నిర్వచనం !! పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా బొజ్జ గణపయ్యను సాదరంగా సాగనంపడానికి ఉత్సాహం చూపుతారు. వినాయక చవితి సందర్భంగా వాడవాడలా వెలసిన పందిళ్లలో పూజలందుకున్న గణనాథుడు ఆదివారం నిమజ్జనానికి తరలి వెళ్లాడు.
వాహనాల మీద ఆశీనుడైన గణనాథుడి ఊరేగింపుల ముందు పిల్లలు, పెద్దలు ఆనందంతో చిందులు వేశారు. డీజే సౌండ్స్ ప్రతిధ్వనించాయి. అనంతరం భక్తిశ్రద్ధలతో విగ్రహాలను గంగమ్మ ఒడిలోకి చేర్చారు.

తెనాలిలో జరిగిన వినాయక విగ్రహ నిమజ్జనం

చేబ్రోలులో నిమజ్జనానికి తరలివెళుతున్న భారీ వినాయక విగ్రహం