
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
ఉచిత ప్రసాద వితరణకు ..
గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ.1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం అందించారు.

దుర్గమ్మకు పలువురు విరాళాలు