ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌

Aug 30 2025 7:29 AM | Updated on Aug 30 2025 7:31 AM

అక్టోబర్‌ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ డిస్టెన్‌న్స్‌ ఎడ్యుకేషన్‌ (సీడీఈ) పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్‌ విధానంలో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ), డెబ్‌ (డిస్టెనన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో) నుంచి 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్‌ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. కోర్సుల కాల వ్యవధి, విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాలను ఏఎన్‌యూసీడీఈ. ఇన్‌ఫో అనే వెబ్‌సైట్‌లో గానీ, 0863 – 2346222, 98484 77441 ఫోను నెంబర్లను సంప్రదించడం ద్వారాగానీ తెలుసుకోవచ్చు.

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కూడా...

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు కూడా షెడ్యూల్‌ విడుదలైంది. దీని ద్వారా రెండేళ్ల కాలపరిమితితో కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ వివరాలను దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడించారు.

తమ్ముడిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్‌

నగరంపాలెం: తమ్ముడిని హత్య చేసిన నిందితుడిని పాతగుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తూర్పు సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. శుక్రవారం పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌ (పీఎస్‌)లో సీఐ వెంకట ప్రసాద్‌తో కలసి డీఎస్పీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌నగర్‌ ఒకటో వీధిలో ఉంటున్న కంచర్ల రమేష్‌, రామిరెడ్డితోట మూడో వీధికి చెందిన సురేష్‌ (30) సొదరులని తెలిపారు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగించే సురేష్‌కు సుమారు పదేళ్ల క్రితం మీరాబీతో ప్రేమ పెళ్‌లైందని అన్నారు. కొన్నాళ్లుగా అన్న, తమ్ముడి మధ్య నగదు పంపిణీ విషయమై గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 22వ తేదీన రాత్రి మణిపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపాన ఇద్దరి మధ్య వివాదం నెలకొందని, ఈ క్రమంలో తమ్ముడిపై అన్న రమేశ్‌ పెట్రోలు పోసి నిప్పంటించాడని తెలిపారు. అతడిని జీజీహెచ్‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేయగా, శుక్రవారం రమేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

పుష్కర ఘాట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

కాపాడిన మత్స్యకారులు

తాడేపల్లి రూరల్‌: ప్రకాశం బ్యారేజ్‌ కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఓ మహిళ కృష్ణానది వరద నీటిలోకి దిగి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ భవానీపురంనకు చెందిన నరేంద్రతో ఏడాదిన్నర క్రితం యామినికి వివాహమైంది. గత ఆరు నెలలుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో యామిని భవానీపురంలోని తల్లిదండ్రులు వద్ద ఉంటోంది. భర్త దగ్గరకు వెళ్లగా ఇంట్లో నుంచి బయటకు నెట్టడంతో మనస్తాపం చెంది సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చింది. చనిపోవడానికి వరదనీటిలోకి దూకింది. పక్కనే పడవలను భద్రపరుస్తున్న మత్స్యకారులు గమనించి నీటిలోకి దిగి ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న తాడేపల్లి మహిళా పీఎస్‌ఐ అపర్ణ సంఘటనా స్థలానికి వెళ్లి యామిని తండ్రి శ్రీనివాసరావును పిలిపించారు. ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

రెండు టన్నుల శివ లింగాకారంలో ప్రసాదం

తెనాలిరూరల్‌: వినాయక చవితి వేడుకల్లో భాగంగా భక్తులు తెనాలిలో శివ లింగాకారంలో ప్రసాదం తయారు చేయించారు. విశాఖపట్నం గాజువాకలోని లంకా గ్రౌండ్స్‌లో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీ సుదర వస్త్ర మహా గణపతి కమిటీ సభ్యులు తెనాలిలోని మిర్చి స్నాక్స్‌లో భారీ లడ్డూ ప్రసాదం చేయించాలని నిర్ణయించారు. ఇందుకు మిర్చి స్నాక్స్‌ నిర్వాహకుడు వి. కిషోర్‌ అంగీకరించి రెండు టన్నుల శివలింగాకార లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రసాదాన్ని శుక్రవారం రాత్రి ఇక్కడ నుంచి గాజువాకకు తరలించారు.

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ 1
1/3

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ 2
2/3

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ 3
3/3

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement