
ఏఎన్‌యూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూన్, జూలై నెలల్లో నిర్వహించిన డిగ్రీ 5, 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు శుక్రవారం విడుదల చేశారు. 5,454 మంది పరీక్షలు రాయగా 4,292 మంది ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌కు సెప్టెంబరు 12లోగా ఒక్కో పేవర్‌కు రూ.1,490 చెల్లించాలని ఏసీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్‌వీ కృష్ణారావు, ఎ.రాధాకృష్ణ, డాక్టర్ జ్ఞానేశ్వర్‌రెడ్డి, సీఈ శివప్రసాదరావు, నోడల్ ఆఫీసర్ రెడ్డి ప్రకాశరావు, ఏఆర్‌బీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.