
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆలిండియా పెన్షనర్స్ కో–ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు కృష్ణనగర్ లోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయం వద్ద పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గుంటూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శేషగిరిరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ రూ. 9వేలు ఇచ్చి, డీఏ జతపరచాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ ద్వారా వైద్య సదుపాయం కల్పించి, హయ్యర్ పెన్షన్ కోసం హయ్యర్ వేజెస్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. రైల్వేలో రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్‌పీఏ గుంటూరు జిల్లా కార్యదర్శి కే.బాబు ప్రసాద్ మాట్లాడుతూ 1995లో ప్రారంభించిన ఈ పీ ఎఫ్ పెన్షన్ ఇప్పటికీ సవరించలేదన్నారు. అనంతరం పీఎఫ్ రీజనల్ కమిషనర్ ప్రభుదత్తా ప్రుష్టిని కలిసి వినతి పత్రం అందజేశారు. సభలో ఎన్‌ఏ శాస్త్రి రాష్ట్ర ఏపీఆర్పిఏ అధ్యక్షుడు కే. గంగాధరరావు, ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో పాటు పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు అధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి నరసయ్య , బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు వి. సాంబశివరావు , జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ నికల్స్ , ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి బి. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.