
91 మందికి ఉద్యోగ కల్పన
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి – శిక్షణ శాఖ సౌజన్యంతో తుళ్లూరులోని సీఆర్‌డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను పలువురు సద్వినియోగం చేసుకున్నారు. 300కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించగా 301 మంది హాజరయ్యారు. వీరిలో 91 మందికి ఉద్యోగాలు లభించాయని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న పలువురు అభ్యర్థులకు ఆయా కంపెనీల హెచ్‌ఆర్ విభాగ ప్రతినిధులతో కలసి సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆఫర్ లెటర్లు అందజేశారు.
కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ప్లేస్‌మెంట్ అధికారి అరుణ కుమారి, సీఆర్‌డీఏ డీసీడీవోఓ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.