
డీఎంహెచ్‌ఓకు ఘన సన్మానం
గుంటూరు మెడికల్: కష్టపడి పనిచేసే వారికి పదోన్నతులు కల్పించటం, వారి సమస్యలను పరిష్కరించటం తమ కర్తవ్యమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. సచివాలయ ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించిన విజయలక్ష్మి, ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహకరించిన ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావులకు సంబంధిత ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ ఏఎన్‌ఎంల తరఫున ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఆత్మీయ అభినందన సన్మాన సభ శుక్రవారం స్థానిక ఎన్జీవో రిక్రియేషన్ హాల్‌లో జరిగింది. సన్మాన సభకు జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు, జిల్లా జేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, ఉమెన్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి, సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు సుకుమార్, వెంకట్ రెడ్డి, జానీబాషా, కృష్ణ కిషోర్, విజయ్, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌పీఎస్ సూరి, సీహెచ్ కళ్యాణ్ కుమార్, అమరావతి అధ్యక్షుడు నాగేశ్వరరావు, సత్తెనపల్లి అధ్యక్షుడు మణిరావు, బాపట్ల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మంగళగిరి అధ్యక్షుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.