
రాజధాని రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని పరిధిలోని రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. శనివారం గుంటూరు కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి నిర్వహించిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రైతులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్న ఇబ్బందులను ఒక పోర్టల్‌లో ఉంచి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
మాట్లాడుతున్న కమిషనర్ కన్నబాబు