
కూటమి కర్కశం
జిల్లాలో 2,521 మందిని అనర్హులుగా పేర్కొంటూ ఎగనామం పెట్టిన సర్కార్ మంచం దిగలేని స్థితిలో ఉన్నవారినీ వదలని చంద్రబాబు ప్రభుత్వం పాలకుల తీరుపై మండిపడుతున్న దివ్యాంగులు, వారి కుటుంబసభ్యులు
దివ్యాంగులపైనా
దివ్యాంగులనే కనికరం చూపని కూటమి కర్కశత్వానికి నిదర్శనంగా పింఛన్ల రద్దు నిలుస్తోంది. అందరిలా పని చేసుకోలేక అవయవలోపాలతో సతమతం అవుతున్న వారిపైనా నిర్దయగా వ్యవహరిస్తోంది
చంద్రబాబు సర్కారు. గతంలో ఇచ్చిన
పింఛన్లు రద్దు చేస్తున్నామంటూ మానవత్వం మరిచి మరీ నోటీసులు జారీ చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష గట్టింది. పింఛన్ తీసేశామంటూ వేలాది మంది దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులిచిచ్చింది. ఉరుములేని పిడుగులా ఈ కఠిన చేదు వార్త విని దివ్యాంగుల గుండె పగిలింది. మూడు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు వరుసగా నోటీసులు అందుతున్నాయి. పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు ఏం చేయాలో దిక్కుతోచక అధికారులను వేడుకుంటున్నారు. తమ గోడు వినమని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంచంపై ఉన్న వారికి కూడా పింఛన్ల తొలగించడంతో దివ్యాంగులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైకల్య శాతం ఎక్కువ ఉన్నా కూడా డాక్టర్లు తగ్గించి నివేదికలు అడ్డగోలుగా రాశారని వాపోతున్నారు.
జిల్లాలో భారీగా తొలగింపు
గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాలో 23,459 మంది దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ఇందులో 2,521 మందికి ప్రస్తుతం తొలగించారు. మంచానికే పరిమితైన దీర్ఘకాలిక రోగులు 479 మంది ఉంటే.. వారిలో 32 మందిని అనర్హులన్నారు. 2,521 మందికి మొండిచేయి చూపారు. రూ.15 వేలు పింఛన్ తీసుకునే దీర్ఘకాలిక రోగుల కేటగిరీ నుంచి 472 మందిని తొలగించి.. దివ్యాంగుల విభాగంలోకి మార్చారు. ఏడుగురికి వృద్ధాప్య పింఛన్ కింద రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.6 వేలు తీసుకునే 388 మందిని వృద్ధాప్య పింఛన్ కిందకు మార్చి రూ.4 వేలు ఇచ్చేందుకు నోటీసులు జారీ చేశారు.
అడ్డగోలుగా పింఛన్ల తొలగింపుతో బాధితుల ఆవేదన