
పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని అంబేడ్కర్ ప్రచార సేవా సమితి డేగల అబ్రహం డిమాండ్ చేశారు. ఆదివారం దళిత సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి అమర్ నాథ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత మహాసభ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిల్లి చెన్నారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జాషువా కళా సమితి అధ్యక్షుడు బత్తుల దాసు మాట్లాడుతూ గుర్రం జాషువా జిల్లా పెట్టాలని దళితుల కోరిక అన్నా రు. 85 శాతం ప్రజల ఆకాంక్ష పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని చెప్పారు. పల్నాడు జిల్లా బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు నల్లబోతుల రాజు, హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా వైస్ చైర్మన్ బి.జీవరత్నం, మాలమహానాడు పాశం శ్యామ్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు జక్కుల కృష్ణయాదవ్, దళిత సేవా దళ్ తళ్లూరి సురేంద్ర పాల్గొన్నారు.