
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్‌మెంట్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. పుజారా భవిష్యత్ బాగుండాలని.. మెరుగైన విజయాలు సాధించాలన్నారు. పుజారా క్రమశిక్షణ, ఆటతీరు దేశానికి మరింత గౌరవాన్ని పెంచాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందిన ఛతేశ్వర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన పుజరా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
As Cheteshwar Pujara announces his retirement wishing him all success in his future endeavours.
His discipline, and focus brought immense pride to the nation.@cheteshwar1 pic.twitter.com/Jxe5JcaZOo— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2025
