వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ
పెదకాకాని: వెనిగండ్లలోని మైత్రి కల్యాణ మండపంలో లైటింగ్, డెకరేషన్‌కు వేలంపాటలు నిర్వహించకుండా కొందరు పంచాయతీ ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంటనే పాటలు నిర్వహించి గ్రామ పంచాయతీ ఆదాయం పెంచాలని అధికారులను కోరారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో కొందరు గ్రామ పెద్దలు సుమారు రూ.కోటి నిధులు సేకరించి కల్యాణ మండపాన్ని నిర్మించారు. గ్రామస్తులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనిని స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మండపాన్ని ఓసీలకు రూ.18,500కి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.12,500కు ఇస్తున్నారు. ప్రతి వేడుకకూ మరుగుదొడ్ల శుభ్రత పేరుతో మరో రూ.500 వసూలు చేస్తున్నారు. మైక్, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పేరుతో మరింత దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్ళు పంచాయతీ సిబ్బంది కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది మైత్రి కల్యాణ మండపంలో 175 వేడుకలు జరిగాయి. మైక్ అండ్ లైటింగ్, పూల అంకరణను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీనిలో పంచాయతీ ఉద్యోగులకు వాటాలు వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కల్యాణ మండపంలో లైటింగ్, పూల అలంకరణకు వేలంపాటలు నిర్వహించకపోవడంతో పంచాయతీ ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి వేలంపాటలు నిర్వహించాలని మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు కోరుతున్నారు.
అలరించిన లఘు నాటికల ప్రదర్శన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం గుంటూరు హ్యూమర్ క్లబ్ 12వ వార్షికోత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వేడుకలకు సంస్థ ఉపాధ్యక్షులు మధువని అధ్యక్షత వహించారు. అనంతరం ఓర్నీ, పోవోయి అనుకోని అతిథి లఘు నాటికలు ప్రదర్శించారు. ఇవి సభికులను అలరించాయి. దర్శకులు గుడివాడ లహరి, సీహెచ్.అమృతవర్షిణి, క్లబ్ వ్యవస్థాప కార్యదర్శి షేక్ లాల్‌వజీర్, కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతిలు ప్రసంగించారు. నటీనటులు మధువని, నాగజ్యోతి, ప్రత్తిపాటి మంగయ్య, డాక్టర్ ఎన్‌వీకృష్ణప్రసాద్, గుడివాడ లహరి, ఎ.రాజశేఖర్, పెండ్యాల రమేష్‌బాబు, ప్రదీప్‌కుమార్, ఎం.క్రిష్ణకిషోర్ తమ పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల్తో ముంచెత్తారు.
గోల్డెన్ ప్రైమ్ సిటీ బ్రోచర్ ఆవిష్కరణ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో 12 ఎకరాలలో సీఆర్డీఏ అఫ్రూవల్‌తో వారాహి ఇన్‌ఫ్రా టౌన్‌షిప్స్ వారి గోల్డెన్ ప్రైమ్ సిటి బ్రోచర్‌ను ఆదివారం సంస్థ చైర్మన్ కొండవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్ దేవమిత్ర రాజా, అరుణ్‌ప్రశాంత్, సాయి ఆదిత్య స్కూల్ డైరెక్టర్ రవీంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లక్కీడిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కారు, రెండు, మూడు బహుమతులుగా రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్ స్కూటీని విజేతలకు అందించారు. ఫ్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అందించారు. గతంలో కేఎస్‌ఆర్ డెవలపర్స్ పెదపరిమి, గొర్లవారిపాలెంలో పంచాక్షరి గార్డెన్స్ దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జొన్నలగడ్డలో వారాహి ఇన్‌ఫ్రాజ్యూయల్ సిటి, విజయవాడలో నిడమానూరులో ఎంబసి విల్లాస్ పూర్తి కావస్తుందని నిర్వాహకులు తెలిపారు.
మైక్, లైటింగ్, డెకరేషన్ పేరిట వసూళ్లు వేలంపాటలు నిర్వహించకుండా పంచాయతీ ఉద్యోగుల దొంగాట పారిశుద్ధ్యం పేరుతో ప్రత్యేక రుసుం ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ
వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ
వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ


