కాంగ్రెస్‌ పెద్దలకు బహిరంగ లేఖ

Sakshi Guest Column BRS Leader Dasoju Sravan

భారత  జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గారికీ, సీడబ్ల్యూసీ సభ్యు లకూ –తెలంగాణలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్‌ నగరంలో నిర్వ హించాలని నిర్ణయించడం, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం. మీరు పొలిటికల్‌ టూరిస్టులుగాకాకుండా, తెలంగాణ అభివృద్ధిపై అధ్యయనం చేయ డానికి వస్తున్న పరిశోధకులుగా, ఈ పర్యటనను ఒక స్టడీ టూర్‌గా సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.  

ముందుగా మీరు ‘విశ్వనగరం’ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నివసిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలకూ, పరిశ్ర మలకూ సకల వసతులూ కల్పిస్తూ, విభిన్న జీవన శైలు లకు నిలయమైన హైదరాబాద్‌ కున్న ‘గంగా జమునా తెహజీబ్‌’ ప్రత్యేక వారసత్వ సంస్కృతిని కేసీఆర్‌ ఎలా కాపాడుతున్నారో గమనించండి. మంత్రి కేటీఆర్‌ సార థ్యంలో ఐటీ రంగం విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ దూసుకుపోతున్న తీరు పరిశీలించండి.    మీ పర్యటనలో తెలంగాణ కొత్త సచివాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 125 అడుగుల అతి పెద్ద విగ్ర హాన్ని చూసి తరించండి. తెలంగాణ అమరవీరులస్మృత్యర్థం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయి అమరవీరుల స్మారకకేంద్రాన్ని సందర్శించండి.మీ పర్యటనలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ‘మిషన్‌ కాకతీయ’లో భాగంగా చెరువులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో చూడండి. మీరు ‘మిషన్‌ భగీరథ’ ఘనత తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 24 వేల పల్లెలకు, 121 నగర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికీ పైపు లైనులు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తూ, ప్రజల దాహార్తిని తీరుస్తోంది ప్రభుత్వం. 

దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో కేవలం 3–4 ఏళ్లలో రికార్డ్‌ స్థాయిలో నిర్మించిన అతి పెద్ద బహుళ దశల ఎత్తి పోతల పథకం ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌’ను సందర్శించండి. అంతే కాదు ఒక పక్క మీరు రాజకీయాలు చేస్తుంటే మరోపక్క కేసీఆర్‌ ‘పాలమూరు– రంగారెడ్డి’ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించి– 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి బీళ్లు పడ్డ భూములను కృష్ణా నదీ జలాలతో తడుపుతున్న విషయాన్ని గుర్తించండి.

‘రైతుబంధు’, రైతులకు బీమా, పంటరుణాల రద్దు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ‘ఉచిత విద్యుత్‌’ సరఫరా వంటి పథకాలు రైతులను ఎలా ఆదుకొంటున్నాయో తెలుసు కోండి.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులా లను ఏర్పాటు చేసింది. ఆ విద్యాలయాలకు వెళ్ళండి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగే బోధనను గమనించండి. ‘కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ’, తెలంగాణ ‘గిరిజన సంక్షేమ గురుకులాల’నూ దర్శించండి.

 ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌తో పాటు, కొత్త జూని యర్‌ కళాశాలల, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఎంత నిబద్ధతతో చేపడుతుందో గ్రహించండి. ‘మన ఊరు– మనబడి’, ‘మన బస్తీ–మన బడి’ పథకంలో నిర్మించిన స్కూల్స్‌ ని సందర్శించండి. ‘కేసీఆర్‌ కిట్‌’, ‘బస్తీ దవాఖానాలు’, ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌’, ‘ఆరోగ్యశ్రీ’ ఇలాంటి అద్భుతమైన పథకాల అమలూ; 34 మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన గణనీయమైన వృద్ధిని అధ్యయనం చేయండి. తండాలు, గూడేల్ని పంచాయతీలుగా మార్చా లని ఎన్నో ఏళ్లనుంచి కోరుకుంటున్న గిరిజనుల కలని కేసీఆర్‌ ప్రభుత్వం నెరవేర్చింది. 

అత్యంత ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దళితుల జీవితాలు ఎంత అద్భుతంగా మార్చిందో మీరు తెలుసుకోవాలి. వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధి ఇస్తున్న వృత్తి చేనేత. నేతన్నల జీవితాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుత మైన మార్పుని పరిశీలించండి. దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమలకు వేలకోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకం, అదే విధంగా కోట్లకొద్దీ చేప పిల్లలను పంపిణి చేసి మత్స్యకారుల ఆదాయానికి తోడ్పడ్డ విషయం తెలుసుకోండి. అలాగే మీ పర్యటనలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ‘డబుల్‌ బెడ్‌ రూమ్‌’ ఇళ్ళని సందర్శించండి. 

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్‌’ పథకాలు తెచ్చిన కల్యాణ కాంతులు చూడండి. కేసీఆర్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల గాథ గురించి చెప్పలంటే  ఇంకా చాల విషయాలు ఉన్నాయి. మీ సీడబ్లు్యసీ సమావేశాల్లో తెలంగాణలో పదేళ్ళలో జరిగిన అభివృద్ధి దేశంలో అరవై ఏళ్లలో ఎందుకు జరగలేదో లోతుగా చర్చించండి. ఒక విశాల దృక్పథంతో ఆలో చించి, తెలంగాణ అభివృద్ధి సంక్షే మాన్ని మీ రాష్ట్రాలలో అమలు చేసి మీ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించండి. 
ఇట్లు మీ   
శ్రవణ్‌
వ్యాసకర్త బీఆర్‌ఎస్‌ నాయకుడు


 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-09-2023
Sep 24, 2023, 03:28 IST
సాక్షి, హైదరాబాద్‌: సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో బూత్‌ల వారీగా పైచేయి సాధనకు పోలింగ్‌బూత్‌ కమిటీలే కీలకమని బీజేపీ గట్టిగా...
24-09-2023
Sep 24, 2023, 02:08 IST
సాక్షి, హైదరాబాద్‌: ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించి...
24-09-2023
Sep 24, 2023, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: పాలమూరులో ‘ఎన్నికల శంఖారావ సభ’తో రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర...
24-09-2023
Sep 24, 2023, 01:51 IST
సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని...
23-09-2023
Sep 23, 2023, 21:18 IST
కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో BRS ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే..
23-09-2023
Sep 23, 2023, 16:29 IST
ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపే ముగ్గురు కీలక నేతల సభల్ని పూర్తి చేయాలని.. 
23-09-2023
Sep 23, 2023, 13:24 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల ఖర్చు ఏ మేరకు ఉండాలి, పరిమితిని ఎలా విధించాలి, అనే అంశంపై ఎన్నో...
23-09-2023
Sep 23, 2023, 08:34 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో గ్రూప్‌ రాజకీయాలకు చెక్‌ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,...
23-09-2023
Sep 23, 2023, 08:11 IST
హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి నేతల నుంచి వార్డు...
23-09-2023
Sep 23, 2023, 07:51 IST
హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే మల్కాజిగిరిలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి...
23-09-2023
Sep 23, 2023, 03:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్న...
23-09-2023
Sep 23, 2023, 01:58 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో గ్రూప్‌ రాజకీయాలకు చెక్‌ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఆ పార్టీ వర్కింగ్‌...
22-09-2023
Sep 22, 2023, 17:10 IST
తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా షర్మిల పార్టీకి ఝలక్‌ ఇస్తూ.. బీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు.. 
22-09-2023
Sep 22, 2023, 11:54 IST
సాక్షి, రాజన్న సిరిసిల్ల: 'వేములవాడ రాజన్న ఆలయ నిధుల మళ్లింపు' పై హిందూ సంఘాల ఆందోళన చెలరేగింది. ఆలయ నిధులు 5 కోట్ల...
22-09-2023
Sep 22, 2023, 09:01 IST
సాక్షి, రంగారెడ్డి: ఎల్‌బీనగర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ పంచాయితీ హస్తినకు చేరింది. దరఖాస్తుల దాఖలు.. గాంధీభవన్‌లో పోస్టర్ల చించివేతతో ముదిరిన లడాయి...
22-09-2023
Sep 22, 2023, 03:20 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏయే స్థానాల్లో ఎవరెవరు...
22-09-2023
Sep 22, 2023, 02:55 IST
సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా...
21-09-2023
Sep 21, 2023, 18:27 IST
ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది
21-09-2023
Sep 21, 2023, 13:01 IST
నిజామాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడు కాబట్టే జైలుకు వెళ్లాడని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు...
21-09-2023
Sep 21, 2023, 12:20 IST
మహబూబ్‌నగర్‌: చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ రూపొందించిన బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదం తర్వాత లోక్‌సభలో ప్రభుత్వం...



 

Read also in:
Back to Top