కూటమి కుటిల ధర్మం | Neelam Nagendra Rao On AP Govt | Sakshi
Sakshi News home page

కూటమి కుటిల ధర్మం

Jun 10 2025 7:33 AM | Updated on Jun 10 2025 7:37 AM

Neelam Nagendra Rao On AP Govt

‘‘నేరాలకు కులం, మతం ఉంటాయా?!’’ అని ఆంధ్రప్రదేశ్‌ హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత అమాయకంగా అడుగుతున్నారు! ఈ దేశంలో నేరాలకే కాదు, శిక్షలకు కూడాకులం, మతం ఉంటాయి. అంతదాకా ఎందుకు? అనితకు ఆ పదవి రావడానికి కూడా కులం కారణం కాదా? రాజ్యాంగాన్ని, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ని, సీఆర్‌పీసీని అనిత ఆపోశన పట్టారని చంద్రబాబు ఆమెకు ఆ పదవిని కట్టబెట్ట లేదు. కులం లెక్కల్లో భాగంగానే ఆమెకు ఆ పదవి దక్కింది. ఆ విషయం మర్చిపోయి ఆమె ఇలా మాట్లాడటమే విచారకరం. మన సమాజం తులసి వనం ఏమీ కాదు. గంజాయి ఇప్పుడు కొత్తగా మొలకెత్తనూ లేదు, తెనాలి లోకి ఎప్పుడూ రాకుండానూ లేదు.

గంజాయి తాగుతున్న యువకులను రౌడీల పేరిట నడి రోడ్డులో కొట్టిన పోలీసులుగంజాయిని అమ్ముతున్న బడా స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ ఎందుకు పెట్టడం లేదు? హోమ్‌మంత్రి అనిత ఇవేమీ ఎరగనట్లు, పోలీసులు కొడితే తప్పేముందని వివరణ పేరుతోతెనాలి ఘటనను మరింత మండించారు. పోలీసు దెబ్బలు తిన్న దళిత యువ కుల్ని పరామర్శించడానికి వైఎస్‌ జగన్‌ రాకూడదు కానీ, అమ్మనబ్రోలులో హత్యకు గురైన మాజీ రౌడీ షీటర్‌ వీరయ్యను పరామ ర్శించడానికి మాత్రం అనిత గారు వెళ్లొచ్చు! అది చాల దన్నట్లు ముఖ్యమంత్రి గారు వస్తారు. ‘‘వీరయ్యను చంపిన వాళ్లకు ఈ భూమ్మీద బ్రతికే హక్కు లేదు’’ అని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రకటిస్తారు! చంపినవాళ్లు బాగున్నారు. చంపించిన వాళ్లు బాగున్నారు.

ఈ కేసుతో ఏమీ సంబంధంలేని ఒంగోలుకు చెందిన ఒక అమాయకదళిత యువకుడు మైరల సూర్య మాత్రం పోలీసు హింసను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు!

అనిత గారూ! మీ జీవితం మీది కాదు, అంబేడ్కర్‌ది. మీ చదువు మీది కాదు, అంబే డ్కర్‌ది. ఇంకా చెప్పాలంటే కారంచేడు, చుండూరు దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరా టాల ఫలితమే మీ దళిత హోంమంత్రి పదవి. తెలుగు దేశం ప్రభుత్వంలో ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఎ.బి. వెంకటేశ్వర రావు కూడా పోలీసులకు కొట్టే హక్కు లేదని, తెనాలి దళిత యువకులుపై దాడి చట్ట వ్యతిరేకమని సెలవిచ్చారు కదా! మాజీ రౌడీషీటర్‌ వీరయ్య చౌదరిని అదే కులం, అదే పార్టీ వారు హత్య చేస్తే హోంమంత్రిగా హుటాహుటిన అర్ధరాత్రి ఒంగోలు వెళ్లి పరామర్శించవచ్చు. అమ్మనబ్రోలులో అంత్యక్రియలకు సాక్షాత్తూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లొచ్చు. కానీ తెనాలిలో దళిత యువకులపై పోలీస్‌ హింసను ప్రతిపక్ష నేత జగన్‌ ఖండించకూడదు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించ కూడదు. ఇదేనా హోంమంత్రి గారూ, దళితుల పట్ల కూటమి ప్రభుత్వ ధర్మం.

– నీలం నాగేంద్ర రావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement