ఛీ..య్యాక్‌..! ఆఫీస్‌ బాత్రూమ్‌నే ఇల్లుగానా..! | A Woman Living In Office Bathroom Due To High Rent Goes Viral | Sakshi
Sakshi News home page

ఛీ..య్యాక్‌..! ఆఫీస్‌ బాత్రూమ్‌నే ఇల్లుగానా..!

Apr 13 2025 12:38 PM | Updated on Apr 13 2025 12:49 PM

A Woman Living In Office Bathroom Due To High Rent Goes Viral

డబ్బులు అందరూ ఆదా చేస్తారు. కాని, చైనాకు చెందిన యాంగ్‌ అనే అమ్మాయి అద్దె డబ్బులను ఆదా చేయడానికి ఏకంగా అఫీసు బాత్రూమ్‌నే తన ఇంటిగా ఎంచుకుంది. అద్దె చెల్లించి మరీ, అక్కడే ఫోల్డబుల్‌ బెడ్‌ వేసుకొని, కమోడ్స్‌ కనిపించకుండా క్లాత్‌ను కర్టెన్‌గా కట్టుకొని పడుకుంటుంది. చిన్న కబోర్ట్‌లాంటి దాంట్లో కిచెన్‌ సామాన్లు సర్దుకుంది. 

బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్‌ రాడ్‌ ఏర్పాటు చేసుకుంది. అక్కడే తన బట్టలు ఉతుక్కొని, బిల్టింగ్‌పై వాటిని ఆరేస్తుంది. ఇలా అచ్చం ఇంట్లో ఉన్నట్లుగానే అందులో ఉంటోంది. వాష్‌రూమ్‌ కదా, అక్కడ వాసన రాదా? అంటే, ఎలాంటి వాసన రాకుండా రోజూ రాత్రి నీట్‌గా క్లీన్‌ చేస్తుందట. 

మళ్లీ ఉదయం కాగానే మంచం, సామాన్లు, కర్టెన్లు అన్నీ ఒక పక్కకు సర్దేస్తుంది. తన ఆర్థిక పరిస్థితిని తను పనిచేసే ఫర్నిచర్‌ ఫ్యాక్టరీ యజమానికి వివరించి, వాష్‌రూమ్‌ను అద్దెకు ఇవ్వమని అడిగింది. ఆయన అద్దె ఏమీ వద్దు, కేవలం  కరెంట్, వాటర్‌ బిల్లు కట్టుకోమని చెప్పాడట. 

ఇప్పుడు కేవలం నెలకు రూ. 545 మాత్రమే బిల్లులకు కడుతోంది. ఇలా తను కూడబెట్టుకున్న డబ్బులతో త్వరలోనే ఇల్లు కొంటానని, అప్పటి వరకు ఈ బాత్రూమ్‌లోనే ఉంటానని చెబుతోంది. తన బాత్రూమ్‌ ఇంటిని ఆమెనే వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

(చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

Advertisement
 
Advertisement
Advertisement