మెహందీ కలర్‌ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్‌..ధర ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

మెహందీ కలర్‌ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్‌..ధర ఎంతంటే..

Published Sun, Jul 16 2023 7:53 AM

What Is The Price Of Brand That Anu Emmanuel Style Creates - Sakshi

అను ఇమ్మాన్యుయేల్‌.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ స్టార్‌ ఫ్యాషన్‌కి ఓ స్టయిల్‌ని క్రియేట్‌ చేసిన బ్రాండ్స్‌లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్‌ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్‌ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి.

బ్రాండ్‌ వాల్యూ:
ఐకేయా
ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్‌లెస్‌ ఫ్యాషన్‌ డిజన్స్‌కి ప్రత్యేకం ఈ బ్రాండ్‌. ఢిల్లీకి చెందిన డిజైనర్‌ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్‌కి చెక్‌ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్‌ బ్రాంచ్‌ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్‌ ధరించి చీర బ్రాండ్‌ ఐకేయా రూ. 74,500/-

హౌస్‌ ఆఫ్‌ శిఖా
చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్‌ మేనేజ్‌మెంజ్‌ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్‌ ఆఫ్‌ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్‌లైన్‌ జ్యూలరీ స్టోర్‌. ప్రముఖ డిజైనర్స్‌ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్‌ అన్నింటిలోనూ న్యూస్టైల్‌ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్‌ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్‌ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్‌ ధర రూ. 6,000
– అను ఇమ్మాన్యుయేల్‌

--దీపిక కొండి

(చదవండి: హాయ్‌..‘అమిగోస్‌’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్‌ ధరించిన చీర ధర ఎంతంటే..!)


 

Advertisement
 
Advertisement