అమిగోస్‌ మూవీ హీరోయిన్‌ ఆశికా రంగనాథ్‌ ధరించిన చీర ధర ఎంతంటే..! | Kannada Actress Ashika Ranganath Wearing Saree And Jewelery Price | Sakshi
Sakshi News home page

హాయ్‌..‘అమిగోస్‌’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్‌ ధరించిన చీర ధర ఎంతంటే..!

Jul 9 2023 9:10 AM | Updated on Jul 14 2023 3:09 PM

Kannada Actress Ashika Ranganath Wearing Saree And Jewelery Price - Sakshi

హాయ్‌..‘అమిగోస్‌’ అంటూ తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి ఆశికా రంగనాథ్‌.. డజన్‌కు పైగా కన్నడ సినిమాల్లో నటించి యూత్‌లో మంచి మార్కులే కొట్టేసింది. ఐతే తాను సినిమాల్లోకి రాకముందు నుంచే అందం పట్ల శ్రద్ధ తీసుకునేదాన్ని. ఓసారి కాలేజీలో అందాల పోటీలో ‘క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేస్‌ అవార్డుతో పాటు సినిమా చాన్స్‌ కూడా వచ్చింది అని చెబుతోంది  ఆశికా రంగనాథ్‌. ఇక ఆ ఘనతలో తమకూ భాగస్వామ్యం ఉందంటున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ..

కవిత గుత్తా.. 
ఓ కుట్టు మెషిన్, ఒక వర్కర్‌తో ప్రారంభమైన ‘కవిత గుత్తా ’ ఫ్యాషన్‌ హౌస్‌.. నేడు టాప్‌ మోస్ట్‌ ట్రెడిషనల్‌ బ్రాండ్‌గా మారింది. అమ్మాయిల లాలిత్యానికి అద్భుతంగా మ్యాచ్‌ అయ్యే పరికిణీలు ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. హైదరాబాద్‌కు చెందిన కవిత గుత్తా.. తన ఇద్దరి కూతుళ్లకు తానే స్వయంగా ఫ్యాబ్రిక్‌ తెచ్చి, డిజైన్‌ చేసి మురిసిపోయేది. అలా తన ఇంటి ఆడపిల్లలతో మొదలైన కవిత గుత్తా డిజైన్స్‌.. నేడు సెలబ్రిటీలను మురిపించే స్థాయికి చేరాయి. ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే ఈ అందమైన డిజైన్స్‌.. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 

జ్యూలరీ బ్రాండ్‌:
వీఏజేఆర్‌ జ్యూలర్స్‌ :స్వచ్ఛమైన వజ్రాల ఆభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌. మెషిన్‌ మేడ్‌ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఇది క్రియేట్‌ చేసుకున్న వాల్యూ. ‘ది రాయల్టీ ఆఫ్‌ హైదరాబాద్‌’ అంటూ హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సంస్థ.. దేశంలోని ప్రముఖ నగరాలకూ విస్తరించి.. పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి.

కవితా గుత్తా.. చీర బ్రాండ్‌:  ఆశికా రంగనాథ్‌ ధరించిన కవితా గుత్తా డిజైనర్‌ చీర ధర.. రూ. 77,700 

(చదవండి: ‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!)

Advertisement
 
Advertisement
Advertisement