దసరా పండుగవేళ నాటుకోడి ధర ఎంతగా పెరిగిందంటే? | Dasara Country Chicken Mutton Sweet Prices | Sakshi
Sakshi News home page

దసరా పండుగవేళ నాటుకోడి ధర ఎంతగా పెరిగిందంటే?

Oct 20 2026 7:29 AM | Updated on Oct 20 2026 7:29 AM

Dasara Country Chicken Mutton Sweet Prices

సాక్షి, తెలంగాణ: సంప్రదాయం ప్రకారం దసరా రోజు తప్పకుండా నాన్‌ వెజ్‌ తింటారు. దీంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది. ప్రస్తుతం నాటుకోడి లైవ్‌ ధర కిలో రూ.800–850, పుంజు రూ.1000 వరకు ఉంది. మాంసంగా లెక్కిస్తే కిలో రూ.1000 నుంచి రూ.1200 అవుతోంది. మటన్‌ కిలో రూ.850–950 మధ్యనే ఉంది.

దీంతో నాటుకోడి రేటు మటన్‌ను దాటేసిందనే చర్చ జరుగుతోంది. సరఫరా తక్కువ, వైరల్‌ వ్యాధులతో కోళ్లు చనిపోవడం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి పిండి వంటల ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడిసరుకుల ధరలు.

మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం.. చక్కెర ధర గత నెల రూ.46–48 ఉండగా ఇప్పుడు రూ.60కు చేరింది. వంట నూనె ధరలు, బియ్యం కిలో రూ.55 నుంచి రూ.80కి చేరడంతో పిండి వంటల తయారీ ఖర్చు భారమైంది. అరిసె, లడ్డూ, గారెల ధరలు కిలోపై రూ.80 నుంచి రూ.150 వరకు పెరిగాయి.

ఇదీ చదవండి: పండుగవేళ పాలపిట్ట కనిపించాలంటే ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement