ఈ ఫుడ్స్‌ తింటే అంతే..షాకింగ్‌ స్టడీ! టాక్స్‌ విధించండి బాబోయ్‌!

Ultra processed food ngos Urge Maharashtra Govt To Impose Tax On Processed Food - Sakshi

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్  32 రకాల ప్రమాదకర వ్యాధులు

ఒక్కోసారి ప్రాణాంతకంకూడా: షాకింగ్ అధ్యయనం

పన్నులు విధించండి అంటున్న  ఎన్‌జీవోలు, విద్యావేత్తలు

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమన్న తాజా సంచలన నివేదికల నేపథ్యంలో అటువంటి ఆహారాలపై పన్ను విధించాలంటూ మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, మనస్తత్వ వేత్తలతోకూడిన సంఘాలు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి.

అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు , కొవ్వుతో కూడిన అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధించాలని  కోరుతూ ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ (ECA) , అసోసియేషన్ ఫర్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (APER),  కేంద్రమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాయి.  తద్వారా పాఠశాలల్లో  చాక్లెట్లు, కేకులు, కుకీలు , పుట్టినరోజులు మరియు ఈవెంట్‌ల వంటి ఇతర వస్తువుల  వినియోగం, పంపణీ ఆగిపోతుందని  నమ్ముతున్నారు.  ఈ పదార్థాల స్థానంలో తాజాపండ్లను చేర్చుకోవాలని  కూడా ప్రజల్ని, పాఠశాలల్ని కోరారు. 

వీరి డిమాండ్లు
♦ అన్ని ఫుడ్‌ చెయిన్స్‌,  రెస్టారెంట్‌లు  మెనూలు, ప్యాకేజింగ్ ,  ప్రతీ బాక్సుపైనా  ఉప్పు-చక్కెర-కొవ్వు శాతం వివరాలను  తప్పనిసరిగా ప్రింట్‌ చేయాలి.
ఉప్పు-చక్కెర-కొవ్వుతో సహా వీటి స్థాయి ఎక్కువుంటే  ఎరుపు రంగు, మధ్యస్థానికి గుర్తుగా కాషాయం, తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగుల లేబులింగ్‌ ఉండాలి. 
♦ బ్రాండ్ పేరు లేదా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌తో రెస్టారెంట్లు విక్రయించే బర్గర్‌లు, పిజ్జాలు, టాకోలు, డోనట్స్, శాండ్‌విచ్‌లు, పాస్తా, బ్రెడ్ ఫిల్లింగ్‌లపై పరోక్ష కొవ్వు కంటెంట్ పన్ను 14.5 శాతం విధించాలి.
♦ చక్కెరపై ఆరోగ్య పన్నును ప్రవేశపెట్టాలి.

అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం చాలా ప్రమాదకరమని, ఇలాంటి ఆహారాన్ని  తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని సైంటిస్టులు  ఇటీవల హెచ్చరించారు. వీటితో  ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఇటీవల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని కూడా వెల్లడించారు.

ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన  ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాదకర వ్యాధులు వస్తాయి. మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని,  ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అంతేకాదు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌తో 50 శాతం పెరుగుతుందని  కూడా హెచ్చరించారు.   డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందట.

అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, అందుకే కేన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం తోపాటు,   మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీ పేర్కొంది.
 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top