ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్‌ | Two Girls Dancing In Delhi Metro, Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్‌

Jun 11 2024 4:06 PM | Updated on Jun 11 2024 4:21 PM

Two Girls Dancing In Delhi Metro, Video Goes Viral

సోషల్‌ మీడియా పిచ్చితో మెట్రో రైళ్లలో కొంతమంది తీరు అభ్యంతరకరంగా, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే, తాజాగా ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషల్‌ మీడియాలో  యూజర్ల రీల్స్‌తో గతంలో ఢిల్లీ మెట్రో  వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో  మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకుల ఆకతాయి పనులకు  అడ్డుకట్ట పడటం లేదు.  

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్సింగ్‌ వీడియోనే ఇందుకు ఉదాహరణ. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న కనీస స్పృహను కూడా మర్చిపోయిన అమ్మాయిలు భోజ్‌పురి పాటకి రాడ్‌ పక్కన నిలబడి స్టెప్పు లేశారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు  చూసీ చూడనట్టు కొందరు, మరి కొందరు అసహనం వ్యకం చేశారు. 

 ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో పోస్ట్‌ అయింది.  మహేంద్ర సింగ్‌ అనే ఎక్స్‌  యూజర్‌  ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.  ఈ రీల్స్‌ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు  మెట్రోలు సైడ్‌కి నిలపండి రా బాబూ, ఎక్కడ చూసినా ఈ రీల్స్‌ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి కూడా విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement