గంటల ప్రయాణం.. ఒళ్లు అలసట.. దీనికి కారణమేంటో తెలుసా? | Travel Fatigue Causes And Prevention Tips | Sakshi
Sakshi News home page

గంటల ప్రయాణం.. ఒళ్లు అలసట.. దీనికి కారణమేంటో తెలుసా?

Oct 31 2026 9:27 AM | Updated on Oct 31 2026 9:27 AM

Travel Fatigue Causes And Prevention Tips

హెల్త్‌

లైఫ్‌

ప్రయాణంలో గంటల తరబడి కూర్చునే ఉంటాం. పెద్దగా నడక, శ్రమ ఉండవు. అయినా గమ్యస్థానానికి చేరుకునేసరికి విపరీతంగా అలసిపోతుంటం. ఒళ్లు బరువుగా అనిపిస్తుంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. దీనినే ‘ట్రావెల్‌ ఫెటీగ్‌’ గా పిలుస్తారు. అంటే ప్రయాణం వల్ల కలిగే ‘మానసిక, శారీరక అలసట’ అన్నమాట.

కారణాలివే!: ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. కండరాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో శరీరంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. విమానంలోని గాలిలో తేమ తక్కువగా ఉండటం, నీరు కూడా తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది.

మరోవైపు ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌జామ్‌లు, సమయానికి చేరుకుంటామో లేదో అనే ఆందోళన, ఆలస్యాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. నిద్ర వేళలు మారడం కూడా అలసటకు కారణమవుతుంది. అయితే ఈ అలసట తగ్గాలంటే.. శరీరానికి తగినంత నీరు తాగాలి. వీలైనప్పుడల్లా లేచి కొద్దిసేపు నడవాలి. సీటులోనే చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ప్రయాణం తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని సహజమైన వెలుతురులో గడపాలి. సరిపడినంత నిద్రపోవాలి.

ఇదీ చదవండి: పర్యావరణ హితమైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఉపయోగిద్దాం ఇలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement