breaking news
physical health problems
-
మనసు మాట విందాం!
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు. మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి.. సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం. ఆమాత్రం చేయలేమా?ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని -
40లలో ఉన్నారా?.. జీవన సరళిలో ఈ మార్పులు తప్పవ్..!
మనిషి జీవితం 40 ఏళ్ళకి ముందు ఒకలా, ఆ తరువాత మరొకలా ఉంటుంది. బాధ్యతలు పెరగటం వల్ల, శరీర మార్పుల వల్ల, రకరకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం కావడం మొదలవుతుంది. అందుకే ఆ వయసుకి రాగానే మన జీవన సరళిలో మార్పులు చేయాలి. ఆ మార్పులేమిటో తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. జీవన సరళిలో చేసుకోవాల్సిన మార్పులు నాలుగు పదుల వయసు వచ్చేసరికి కండరాల్లో సాంద్రత తగ్గుతూ ఉంటుంది. రక్త సరఫరా కూడా నెమ్మదిస్తుంటుంది కాబట్టి, దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అన్నం పరిమాణాన్ని తగ్గించాలి. తాజాఫలాలు ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి. కంటిచూపు మందగించకుండా విటమిన్ ఎ, సి ఉండే పదార్థాలు తినాలి. మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి. ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే నీళ్ళు బాగా తాగాలి. వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ చూసుకోండి. ఫ్యాట్ ఉంటే కరిగించండి. బలహీనంగా ఉంటే బరువు పెంచండి. విటమిన్ ఎ, సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధకశక్తి పెంచుకోవాలి. మెంటల్ హెల్త్ బాగుండాలంటే ప్రశాంతంగా ఉంటూ తగినంత నిద్ర పోవడం అవసరం. (చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..) -
ఇల్లే నయా జిమ్
సాక్షి, అమరావతి: శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి ‘ఫిట్నెస్’ మంత్రం జపిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల ముప్పును తప్పించుకునేందుకు అత్యధికులు వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పట్టణాలు, నగరాలతోపాటు సెమీ అర్బన్, సబ్ అర్బన్ ప్రాంతాల్లోనూ ‘హోమ్ జిమ్’ ట్రెండ్ పెరుగుతోంది. గుండె ఆరోగ్యంపై దృష్టి గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడటం వలన కార్డియోవాస్కులర్ వ్యాయామ పరికరాలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవే మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ట్రెడ్మిల్స్, స్టేషనరీ బైక్‌లు, రోయింగ్ యంత్రాలు, ఎలిప్టికల్స్ ఉన్నాయి. భారత్ టాప్.. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో గత ఏడాది గృహ ఫిట్నెస్ పరికరాల పరిశ్రమ మార్కెట్ విలువ 13,741.23 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆసియన్–పసిఫిక్ దేశాల్లోనే అత్యధిక మార్కెట్ విలువగా నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలు అత్యధికంగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. దేశంలో భౌగోళికంగా చూస్తే పశ్చిమ, మధ్య భారతం అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇక్కడ పట్టణీకరణ, పెరుగుతున్న తలసరి ఆదాయం దీనికి కారణంగా తెలుస్తోంది. తూర్పు, దక్షిణ భారత దేశంలోనూ ఫిట్నెస్ మార్కెట్ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వృద్ధి దేశంలో ఇటీవల గృహ వ్యాయామ పరికరాల కొనుగోలులో 45 శాతం ఆన్లైన్ ఆర్డర్లు పెరిగాయి. ముఖ్యంగా ట్రెడ్మిల్స్, ఎక్సర్సైజ్ బైక్‌లు, డంబెల్ సెట్లు, బెంచ్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. సుమారు రూ.1,300–రూ.2,000 ధరలో వివిధ రకాల బరువులు, రాడ్లు, వెయిట్ బార్లు, జిమ్ ఉపకరణాలు లభిస్తున్నాయి. మరోవైపు యోగా మ్యాట్లు, రెసిస్టెన్స్ బ్యాండ్లు, ఫోమ్ రోలర్లు, టమ్మీ ట్రిమ్మర్లు వంటి సులభమైన వ్యాయామ పరికరాల విక్రయం విరివిగా ఉంటోంది. ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గత సంవత్సరం దాదాపు ఏడు రెట్లు పెరిగింది. చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకే పరికరంపై 3కు పైగా వివిధ రకాల వ్యాయామాలు చేసుకునేలా డిజైన్లు చేస్తున్నాయి. ‘స్మార్ట్’గా వాడుతున్నారు ఫిట్నెస్ యాప్‌ల డౌన్లోడ్లు భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగాయి. 2023లో స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్ల వంటి వేరియబుల్ టెక్నాలజీలు సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. దీంతోపాటు ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్/వర్చువల్ ఫిట్నెస్ సెషన్లు పెరగనున్నాయి. ఇంతకు ముందు ఆన్లైన్ శిక్షణ గురించి పెద్దగా అవగాహన లేనివారు కూడా ఇప్పుడు ఆన్లైన్ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండటం విశేషం. ఆసక్తి పెరిగింది కోవిడ్ తర్వాత హోమ్ జిమ్‌లు పెరిగాయి. తక్కువ ధరల్లో వ్యాయామ పరికరాలు వస్తుండటం, ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో చాలామంది స్వయంగా వ్యాయామాలు చేయడం నేర్చుకుంటున్నారు. కొంతమంది మా లాంటి ట్రైనర్స్‌ను పెట్టుకుంటున్నారు. హోమ్ జిమ్ ఇంటిల్లిపాదికి ఎంతగానో ఉపయోగపడుతోంది. – సందీప్, ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ -
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే ఇలా చేయాలి..!!
-
మనసును వ్యాకుల పరిచే డిప్రెషన్
మీకు తెలుసా? డిప్రెషన్... ఈ సమస్య ఎలా వచ్చి పడుతుందో కానీ చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంటుంది. మానసికంగా మొదలై శారీరక సమస్యలకు దారి తీసే ఈ రుగ్మతను ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు. జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం అన్నమాట. ఒకసారి చిన్నప్పటి స్నేహితులందరినీ గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్న వారితో ఫోన్ చేసి కబుర్లు చెప్పాలి. కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే నిద్రమాత్రలను ఆశ్రయించవద్దు. రాత్రి భోజనంలో నిద్రను పెంచే ఆహారాన్ని (నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం వంటివి) తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడక, యోగసాధన, జిమ్ వంటివీ ఏదో ఒక వ్యాయామం చేయాలి. వ్యాయామంతో దేహంలో ఫీల్‌గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగనివ్వాలి.


