
మరమరాలను పఫ్డ్ రైస్ అని కూడా పిలుస్తారు. దీన్ని బెస్ట్ స్నాక్ ఐటమ్‌గా చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఉగ్గాని, పిడతకింద పప్పు వంటి పేర్లతో రకరకాల స్నాక్ ఐటెమ్స్ చేసుకుని తింటారు. ముఖ్యంగా వీటితో చేసే లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్ చాలా బాగుంటాయి. దీన్ని పలు ప్రాంతాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తారు. అలాంటి మరమరాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా!.
ఇది బెస్ట్ టైమ్ పాస్ ఫుడ్ స్నాక్ మాత్రమే కాదు.ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరమరాలలో విటమిన్ డి, విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం, దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుంది. వీటిని రోజూ స్నాక్‌గా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఎముకల బలానికి..
మరమరాలలో విటమిన్ డి, బిలతో పాటు కాల్షియం, ఐరన్, థయామిన్, రిబోఫ్లావిన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. ముఖ్యంగా ఈ పోషకాలు ఆస్టియోపొరోసిస్ ముప్పును తగ్గిస్తాయి. ఎముకలను బలంగా ఉంచుకోవడానికి మరమరాలు స్నాక్‌గా తీసుకోండి. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగితే.. రోజువారి ఆహారంలో దీన్ని జోడించడం వల్ల త్వరితగతిన కోలుకుంటారు.
అధిక బరువు సమస్య..
దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది.ఎక్కువ కాలం ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోకుండా.. నియంత్రిస్తుంది. బరువు తగ్గేవారికి మరమరాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జంక్ ఫుడ్‌కు బదులుగా మరమరాలు తీసుకుంటే.. బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
గ్లుటెన్ ఫ్రీ..
మరమరాలు గ్లూటెన్ ఫ్రీ గోధుమలు తినని వారు ఇది మంచి ఇది మంచి ఆప్షన్ మరమరాలతో బరువు పెరగకుండా ఉంటారు. గ్లూటెన్ అలర్జీతో బాధపడేవారు ఉంటారు. దీంతో వారు గోధుమలు వాటితో తయారు చేసిన ఆహారాలు తినలేని పరిస్థితి ఉంటుంది. ఇది గోధుమలకు మంచి ప్రత్యామ్నాయం.
సోడియం..
మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇది తీసుకుంటే మంచి స్నాక్ ఐటం సోడియం శాతం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉప్పు ఉండదు కాబట్టి ఇది మంచి హెల్తీ ఆప్షన్ గా సులభంగా తినొచ్చు. బీపీ పెరుగుతుందనే భయం ఉండదు.
జీర్ణ సమస్యలకు చెక్..
మరమరాలు పేగు ఆరోగ్యానికి మంచిది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి. మరమరాలను నీటిలో నానబెట్టి సాఫ్ట్ గా అయ్యాక తీసుకుంటాం కాబట్టి ఇది సమయం పడుతుంది. పేగు ఆరోగ్యానికి జీర్ణసమస్యలు దరిచేరవు. జీర్ణర సమస్యలతో బాధపడేవారు ఏ ఆలోచన లేకుండా సులభంగా తినవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ డైట్‌లో చేర్చుకునే ముందు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు మేరకు అనుసరించటం మంచిది.
(చదవండి: హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్)