హెయిర్‌ స్ట్రైయిట్‌నింగ్‌ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్‌

Womans Scalp Burns During Hair Straightening - Sakshi

ఇటీవల కాలంలో రకరకాల హెయిర్‌ స్టైయిలిష్‌లు వచ్చేశాయి. అందుకోసం కొన్ని రకాల కెమికల్స్‌ వాడటం జరుగుతుంది. అయితే అవి కొందరికి రియాక్షన్ ఇచ్చి సమస్యలు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి అంత సీరియస్‌ ఇష్యూని రైజ్‌ చేయలేదు కానీ, హెయిర్‌ స్ట్రైయిట్‌నింగ్‌ మాత్రం డేంజరస్‌ అని ఓ మహిళ విషయంలో వెల్లడయ్యింది. తాజా అధ్యయనంలో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. పైగా దయచేసి మహిళలెవరూ ఈ హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ చేయించుకోవద్దు, సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ఏమవుతుందంటే..

సెలూన్‌లో హెయిర్‌ స్ట్రైయిట్‌నింగ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ హెయిర్‌ స్ట్రైయిట్‌నింగ్‌ ట్రీట్‌మెంట్‌లో వాడే రసాయనం వల్ల శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధలనో తేలింది. 26 ఏళ్ల మహిళ పలు దఫాలుగా అంటే..జూన్‌ జూన్ 2020, ఏప్రిల్ 2021, జూలై 2022లో సెలూన్‌లో హెయిర్‌ స్ట్రయిట్‌నింగ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకునే ముందు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదుర్కొన్న చరిత్ర లేదు. ఇలా చేయించకున్న కొన్నాళ్ల తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది.

ఈ హెయిర్‌ స్ట్రెయిట్‌నింగ్‌ కారణంగా నెత్తిపై మంట, గడ్డలు ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత మూత్రంలో రక్తం పడటం వంటివి జరిగాయి. దీంతో వైద్యులను సంప్రదించగా ఆమె కేసుని క్షణ్ణంగా స్టడీ చేశారు. అందులో భాగంగా హెయిర్‌ స్ట్రెయిట్‌నింగ్‌లో వాడే క్రీమ్‌ గ్లైక్సిలిక్ యాసిడ్‌పై అధ్యయనం చేశారు వైద్యులు. దీని కారణంగానే ఆమె నెత్తిపై మంట, గడ్డలు ఏర్పడ్డాయని భావించారు. పైగా ఈ హెయిర్‌ క్రీమ్‌ కారణంగా ఏమైన దుష్పరిణామాలు ఉన్నాయేమోనని ఎలుకలపై ప్రయోగం చేశారు. ఆ పరిశోధనలో ఆ యాసిడ్‌ చర్మం ద్వారా మూత్రపిండాలకు చేరి, దాని పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు గుర్తించారు.

ఈ రసాయనం కారణంగానే బాధిత మహిళ మూత్రపిండ నాళికలలో కాల్షియం ఆక్సలేట్‌ స్పటికాలు పేరుకుపోయి మాత్రపిండాల పనితీరు దెబ్బతినేందుకు దారితీసిందిన తేలింది. ప్రస్తుతం సదరు మహిళ తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రచురితమయ్యింది. వైద్యులు తమ పరిశోధనలో జుట్టుని నిటారుగా చేయడంలో గ్లైక్సిలిక్‌ యాసిడ్‌ బాధ్యత వహిస్తుందని, ఐతే ఇది ఆరోగ్యానికి ఎట్టిపరిస్థితుల్లోనూ సురక్షితం కాదని తేలింది.

అందువల్ల దయచేసి హెయిర్‌కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో ఈ గ్లైక్సిలిక్‌ యాసిడ్‌ వాడకాన్ని నిషేదించాలని తయారీదారులను కోరుతున్నారు ఫార్మసీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జాషువా డేవిడ్‌ కింగ్‌ లైవ్‌. ఈ టెక్రిక్‌ని 1890ల నుంచి ఉపయోగిస్తున్నారు. కురులకు సొగసైన రూపు ఇచ్చేలా స్ట్రైయిట్‌నింగ్‌ చేయడం కారణంగా అనారోగ్య సమస్యలు బారిన పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. 

(చదవండి: వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్‌ అయిన బ్రియాన్‌ జాన్సన్! ఏకంగా..)

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top