శాటిన్ హాల్టర్ డ్రెస్‌లో పుత్తడి బొమ్మలా ప్రియాంక చోప్రా..! | Priyanka Chopra Turns Heads In A Chic Rs 1.8 Lakh Satin Halter Dress | Sakshi
Sakshi News home page

శాటిన్ హాల్టర్ డ్రెస్‌లో పుత్తడి బొమ్మలా ప్రియాంక చోప్రా..! అద్భుతమైన ఫ్యాషన్‌ పాఠం

Jun 25 2026 11:47 AM | Updated on Jun 25 2026 12:19 PM

Priyanka Chopra Turns Heads In A Chic Rs 1.8 Lakh Satin Halter Dress

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్‌ ఐకాన్‌గా తనదైన శైలిలో అలరిస్తుంటుంది. అది క్యాజువల్‌ అయినా..ఖరీదైన డిజైనర్‌వేర్‌ అయినా..సందర్భానుగుణంగా తన లుక్‌తో అక్కడున్న వారందర్నీ ఆకర్షించడంలో ప్రియాంకకు సాటిరారెవ్వరూ. ఈసారి అలానే కేన్స్‌ లయన్స్‌ వేడుకలో తన క్యాజువల్‌తో పవర్‌ డ్రెసింగ్‌తో అద్భుతమైన ఫ్యాషన్‌ పాఠం చెప్పకనే చెప్పింది. 

బహిరంగ కార్యక్రమాల్లో అందరి దృష్టిని ఆకర్షించేలా రెడి అవ్వడం ఆమెకు మాత్రమే తెలుసు. మనం ఎంచుకునే దుస్తులే మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిసిస్తుంది అనే మాటకునిలువెత్తు నిదర్శనం ప్రియాంక. ఎందుకుంటే ఈ గ్లోబల్‌ స్టార్‌ కేన్స్‌ లయన్స్‌కు హాజరయ్యారు. ఇది ఐదు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సృజనాత్మక ఉత్సవం. 

ఈ కార్యక్రమానికి కథ చెప్పడం, మౌలికత, ఒకరి దృక్పథాన్ని చెక్కుచెదరకుండా ఎలా ఉంచుకోవాలి అనే అంశంపై డెబస్సీ థియేటర్‌లో మాట్లాడాలనే ఆహ్వానంపై వచ్చారామె. ఇటాలియన్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడిన ఈ మ్యాక్సీ డ్రెస్, కాలమ్ సిల్హౌట్‌తో ఉంటుంది. ఇది ప్రియాంకకు స్టైలిష్‌ లుక్‌ని అందించింది. వెనుక భాగంలో టై డీటైలింగ్‌తో కూడిన హాల్టర్ నెక్లైన్  ప్రియంకా లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఈ డ్రెస్‌ ధర వచ్చేసి రూ. 1,81,000 ధర పలుకుతుందట. 

దీన్ని సిల్వియా టెరాస్సీ  రూపిందించారు. ఈ డ్రెస్‌ లుక్‌కి అనుగుణంగా  రూ. 35,574 విలువైన ఫ్రెడా సాల్వడార్ లెదర్ థాంగ్ చెప్పులను జత చేశారు. ఈ వేడుకలో ప్రియాంక ప్రసంగించాల్సి ఉండటంతోనే ఇలా తన క్యాజువల్‌ డ్రెసింగ్‌ ఫ్యాషన్‌తో అద్భుతమైన పాఠం చెబుతున్నట్లుగా సింపుల్‌ లుక్‌లో రావడం విశేషం.  ఈ డ్రెస్‌కు ఆమె పింక్ నెక్లెస్, రోలెక్స్ డే-డేట్ 40 చాక్లెట్ డయల్ వాచ్‌ను యాక్సెసరైజ్‌గా ధరించింది. చాలా లైట్‌వైట్‌ మేకప్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ కార్యక్రమంలో ప్రియాంక ఇలా మాట్లాడారు. తాను కథాంశాన్ని ఎంచుకునేటప్పుడు అంతరాత్మ చెప్పే మాటకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. 

తాను ట్రెండ్స్‌ను అనుసరించడానికి ప్రయత్నించనన్నారు. ఎందుకంటే ట్రెండ్‌ ఇప్పటికే ఆసక్తికరం..వారానికి అంత ఇంట్రెస్టింగ్‌ ఉండదు. ఇక్కడ ఒక సినిమా పూర్తవ్వడానికి ఏడాది పడుతుంది. ఏడాది గడిచినా..ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా ఉండాలే తప్ప దాని క్రేజ్‌ ఎన్నేళ్లు గడిచిని తగ్గకూడదని కోరుకుంటానంటోంది. 

థియేటర్‌ నుంచి బయటకి రాగానే ఆ మూవీ నుంచి చెప్పడానికి ఏదో ఒక విషయం చెప్పేలా ఉండాలి, అలాంటివే తను చేస్తానని చెబుతోంది. అందుకే తాను సినిమా స్క్రిప్ట్‌లు చదివేటప్పుడు ఈ సినిమా చూస్తే నాకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది?' అని ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటానని చాలా చక్కగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ప్రియాంక.

 

(చదవండి: Isha Ambani: ఎరుపు రంగు డిజైనర్‌వేర్‌లో ఇషా స్టైలిష్‌ గర్ల్‌ లుక్‌..!)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement