ఎరుపు రంగు డిజైనర్‌వేర్‌లో ఇషా స్టైలిష్‌ గర్ల్‌ లుక్‌..! | Isha Ambani in vibrant red dress paired with mom Nita Ambanis jewels | Sakshi
Sakshi News home page

Isha Ambani: ఎరుపు రంగు డిజైనర్‌వేర్‌లో ఇషా స్టైలిష్‌ గర్ల్‌ లుక్‌..!

Jun 24 2026 11:59 AM | Updated on Jun 24 2026 12:11 PM

Isha Ambani in vibrant red dress paired with mom Nita Ambanis jewels

ఫ్యాషన్‌, హస్తకళలను ఇష్టపడే అంబానీ కుటుంబానికి చెందిన ఇషా అంబానీ  ఎప్పటికప్పుడు తన దుస్తులతో భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని చాటుతుంటుందామె. విలాసవంతమైన ఆభరణాలు, పర్యావరణ థీమ్‌తో కూడిన నగలతో సదా ఆకర్షణీయమైన లుక్‌లో కనిపిస్తారామె. ఈసారి మాత్రం ఇషా గ్లామరస్‌ లుక్‌లో అత్యంత స్టైలిష్‌గా కనిపించారు. ఆధునిక అమ్మాయిలా ఆమె లగ్జరీయస్‌ లుక్‌ అందర్నీ కట్టిపడేసింది. 

జూన్‌24న జరిగిన సెర్పెంటైన్ సమ్మర్ పార్టీకి ఇషా అందరి దృష్టిని ఆకర్షించారు. సరికొత్త గ్లామరస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారామె. తన డిజైనర్‌స్టీవ్‌ ఓ స్మిత్‌ రూపొందించిన ఎరుపు రంగు ఎంబెల్లిష్డ్‌ దుస్తులలో మెరిశారామె. ఆ డ్రెస్‌కి అనుగుణమైన బ్లానిక్‌ హీల్స్‌, తల్లి నీతా అంబానీ ఆభరణాల కలెక్షన్‌కి చెందిన చెవిపోగులను జత చేశారు. ఈ సెర్పెంటైన్ సమ్మర్ పార్టీకి ఇషా అంబానీ ధరించిన స్టీవ్ ఓ స్మిత్ డ్రెస్, ఫ్లాపర్-గర్ల్ గ్లామర్ అండ్‌ ఆధునిక పార్టీ గర్ల్‌ సమ్మర్‌ సౌందర్యాల అద్భుతమైన కలయిక. 

ఈ ప్రకాశవంతమైన ఎరుపు రంగు డ్రెస్‌పై పారదర్శకమైన నల్లటి ట్యూల్ ఓవర్‌లే ఉంది, ఇది డ్రెస్‌కు ఒక ప్రత్యేకమైన సొబగులు అందించింది. ఈ నల్లటి ట్యూల్‌ ఓవర్‌లే యానిమల్ ప్రింట్‌ను పోలి ఉండే అడ్డ వరుస ఎంబ్రాయిడరీ నమూనాపై నల్లటి మెరిసే పూసలను చేతితో అల్లారు. చేతులు లేని డిజైన్, క్రూ నెక్లైన్, శరీరానికి అతుక్కుపోయే సిల్హౌట్, అసమానమైన అంచు అలాగే గాలికి తేలికగా కదిలే స్కర్ట్ ఇషాని మెడ్రన్‌గా కనిపించేలా చేసింది. 

ఆభరణాల పరంగా..ఆమె చెవులకు యాషర్-కట్ మల్టీ-క్యారెట్ వజ్రం పొదిగిన నాజూకైన వేలాడే చెవిపోగులను ఎంచుకుంది. అదే సమయంలో, ఆమె చేతులకు కాక్‌టెయిల్ రింగులు, ఒక ప్రత్యేకమైన బటర్‌ఫ్లై రింగ్‌తో సహా వజ్రాలు, కెంపులతో చేసిన ఆభరణాలను ధరించింది. అలాగే ఆహార్యం పరంగా చక్కటి హెయిర్‌స్టైల్‌తో తేలికపాటి మేకప్‌ టచ్‌తో ఆధునిక అమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షించింది. 

 

(చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్‌..! మత్స్యకారుల..)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement