అడవి అందాల మధ్య వాక్‌ | Nocturnal Walk held at the Manchirevula Forest Trek Park | Sakshi
Sakshi News home page

అడవి అందాల మధ్య వాక్‌

May 26 2025 10:20 AM | Updated on May 26 2025 10:20 AM

Nocturnal Walk held at the Manchirevula Forest Trek Park

అడవి అందాలు, పక్షుల కిలకిల రావాలు, అనేక రకాల క్షీర జాతుల వీక్షణలతో ప్రకృతి ప్రేమికులు సందడిగా గడిపారు. మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకూ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన ఎకో టూరిజం బ్రాండ్‌ డెక్కన్‌ ఉడ్స్, ట్రయల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నాక్టర్నల్‌ వాక్, బర్డ్‌ వాక్‌ కార్యక్రమంలో 22 మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాత్రి సమయంలో టార్చ్‌లైట్ల వెలుగులో నేచరలిస్టులు అఖిల్, సుమన్, అపరంజని పర్యవేక్షణలో నాగార్జునసాగర్‌ రేసర్‌ పాము, రెండు కట్ల పాములు, పాడ్డీ ఫీల్డ్‌ ఫ్రాగ్స్, ఒర్నేట్‌ నారో మౌత్‌డ్‌ ఫ్రాగ్‌లు, బుల్‌ ఫ్రాగ్‌లను వీక్షించారు. 

ఉదయం బర్డ్‌ వాక్‌లో గ్రే బెల్డీ కుక్కూ, బ్లూ ఫస్త్రస్ట్‌ మాల్కోకా, ఒరియంటల్‌ హనీ బజార్డ్, శిఖర, ల్యాంప్‌ వింగ్స్, నైట్జార్, బాక్‌ షోల్డర్‌ కైట్స్‌ వంటి అరుదైన పక్షులను వీక్షించారు. ఔత్సాహిక ప్రకృతి ప్రేమిలకుల కోసం నేచర్‌క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తిగలవారు తమను సంప్రదించాలని ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎల్‌.రంజిత్‌నాయక్‌ సూచించారు.  

(చదవండి: కాస్మో'టెక్‌' సిటీ..మేకప్‌ రంగానికి పెరుగుతున్న ఆదరణ..)

Advertisement
 
Advertisement
Advertisement