కాస్మో'టెక్‌' సిటీ..మేకప్‌ రంగానికి పెరుగుతున్న ఆదరణ.. | Cosmo Tech reports significant growth in Hyderabad | Sakshi
Sakshi News home page

కాస్మో'టెక్‌' సిటీ..మేకప్‌ రంగానికి పెరుగుతున్న ఆదరణ..

May 26 2025 9:50 AM | Updated on May 26 2025 9:50 AM

Cosmo Tech reports significant growth in  Hyderabad

హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ఫ్యాషన్, సినిమా, టెలివిజన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల పెరుగుదలతో మేకప్‌ రంగం కూడా భారీగా విస్తరిస్తోంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలనే ఆవశ్యకత, సోషల్‌ మీడియా ప్రభావం, వివిధ వేదికలపై కనిపించే అవకాశం పెరిగినకొద్దీ మేకప్‌ సర్వీస్‌కు డిమాండ్‌ అధికమవుతోంది. ఒక కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకే పరిమితమైన మేకప్‌ ఇప్పుడు సినిమాలు, యాడ్స్, మోడలింగ్, థియేటర్, ఫ్యాషన్‌ షోలు, ఫొటోషూట్లు, వర్క్‌ ప్రెజెంటేషన్‌లు, డిజిటల్‌ క్రియేటివిటీ లాంటి అనేక రంగాల్లో సౌందర్య సాధనాల అవసరాన్ని గుర్తుచేస్తోంది.. 

మేకప్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ఎంచుకునే వారికి నగరంలో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. నగరంలో జరిగే వివాహ వేడుకలు, సినిమా షూటింగులు, సోషల్‌ మీడియా షూట్స్, బ్రాండ్‌ ప్రమోషన్స్‌ వంటివి మేకప్‌ ఆరి్టస్టులకు రెగ్యులర్‌ పని కల్పిస్తున్నాయి. ఇందులో కొంతమంది సెలబ్రిటీ మేకప్‌ ఆరి్టస్టులుగా ఎదుగుతుంటే, మరికొందరు ఫ్రీలాన్సర్లుగా, స్వతంత్ర సెలూన్లు లేదా స్టూడియోస్‌ స్థాపిస్తూ సొంత బ్రాండ్‌ ఇమేజ్‌ సృష్టించుకుంటున్నారు. 

తమ సొంత బ్రాండ్‌ డెవలప్‌ చేస్తూ కొంత మంది బ్యూటీషియన్లు సోషల్‌ సెలబ్రిటీలుగా మారుతున్నారు. డిజిటల్‌ మీడియాలో మేకప్‌ ట్యుటోరియల్స్, ట్రెండ్‌ లుక్స్, సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ప్రభావంతో యువత ఈ రంగంలో భవిష్యత్తును మెరుగుపరుచుకుంటోంది. డిజిటల్‌ పోర్ట్‌ఫోలియో, బ్రాండ్‌ భాగస్వామ్యాలతో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. నిబద్దతతో శిక్షణ, సృజనాత్మకత, అప్డేటెడ్‌ ట్రెండ్స్‌కి అనుగుణంగా మెళకువలు పెంచుకుంటే, ఈ రంగంలో విజయానికి ఎలాంటి అవరోధాలు ఉండవు.

వెలుగులు నింపే వెడ్డింగ్‌.. 
ఇది అత్యధిక డిమాండ్‌ ఉన్న విభాగం. వధూవరులకు ప్రీ–వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్‌ వెడ్డింగ్‌ లుక్స్‌ కోసం ప్రత్యేక మేకప్‌ అవసరం. వెడ్డింగ్‌ మేకప్‌ అనేది మేకప్‌ రంగంలో అత్యంత డిమాండ్‌ ఉన్న విభాగం. ప్రతి వధువు తన వివాహం రోజున గ్లోవింగ్, ఫొటోజెనిక్‌ లుక్‌ను కోరుకుంటుంది. ఇది కేవలం మేకప్‌ మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మేకప్‌ చేయాల్సి ఉంటుంది. వెడ్డింగ్‌ మేకప్‌లో ప్రధానంగా ఫొటోషూట్ల కోసం లైట్, నేచురల్‌ లుక్స్‌తో ప్రీ–వెడ్డింగ్‌ మేకప్, సంప్రదాయ, గ్లామరస్‌ లుక్‌ కోసం హెవీ ఫౌండేషన్, కాంటూరింగ్, ఐ మేకప్, హెయిర్‌ స్టైలింగ్‌తో వెడ్డింగ్‌ డే మేకప్, ఫ్యూజన్‌ స్టైల్, స్మోకీ ఐస్‌తో ఆధునిక, ట్రెండీ రిసెప్షన్‌/పోస్ట్‌ వెడ్డింగ్‌ మేకప్‌ వంటివి ఉన్నాయి.

సినిమాటిక్‌ లుక్‌ కోసం..  
నటీనటుల స్క్రీన్‌ ప్రెజెన్స్‌కి మేకప్‌ కీలకం. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి పని చేసే మేకప్‌ ఆరి్టస్టులు ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో మేకప్‌ అనేది కేవలం అందాన్ని కాకుండా, పాత్ర స్వభావాన్ని, వయసును, కాలప్రమాణాన్ని ప్రదర్శించే ఓ సాధనం. ఈ విభాగంలో బేసిక్‌ స్క్రీన్‌ మేకప్, పీరియడ్‌ డ్రామా మేకప్, గాయాలు, వృద్ధాప్య మేకప్, ఫాంటసీ పాత్రలు కోసం ఉపయోగించే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ మేకప్‌ వంటి విధానాలుంటాయి. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్‌ నగర్‌ ప్రాంతాల్లో సినిమాటిక్‌ మేకప్‌ ఆరి్టస్టులకు మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని సంస్థలు ఈ రంగంలో స్పెషలైజ్డ్‌ ట్రైనింగ్‌ కూడా అందిస్తున్నాయి.

కార్పొరేట్, గ్లామర్‌ ఈవెంట్స్‌
ప్రొఫెషనల్‌ లుక్స్‌ అవసరం అయ్యే ఈవెంట్స్‌లో కూడా మేకప్‌ సర్వీసులు ఆశ్రయిస్తున్నారు. నేటి కార్పొరేట్‌ ప్రపంచంలో ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కీలకం. మహిళలే కాకుండా, పురుషులు కూడా గ్లామర్, కాని్ఫడెన్స్‌ కోసం మేకప్‌ సేవలు ఆశ్రయిస్తున్నారు. 

ఇందులో తక్కువ మేకప్‌తో చక్కటి స్కిన్‌ టోన్, క్లీన్‌అప్, గ్లో ఫినిష్, నేచురల్‌ లుక్, ఈవెంట్‌ స్పెసిఫిక్‌ మేకప్, మ్యాట్‌ ఫినిష్, లాంగ్‌ లాస్టింగ్‌ లుక్స్‌ వంటి మేకప్‌లు ఉన్నాయి. ఇవన్నీ టైమ్‌ మేనేజ్‌మెంట్, కస్టమైజేషన్‌ మీద ఆధారపడి ఉంటాయి. కొంతమంది బిజినెస్‌ కస్టమర్లకు రెగ్యులర్‌ మేకప్‌ సపోర్ట్‌ కూడా అవసరం అవుతోంది.

శిక్షణలో టాప్‌..
మేకప్‌ శిక్షణ అందించే అనేక ప్రైవేట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు నగరంలో ఉన్నాయి. వీఎల్‌సీసీ, లాక్మే అకాడమీ, నేచురల్‌ టఐనింగ్‌ అకాడమీ, జావీద్‌ హబీబ్‌ అకాడమీ, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. 

ఈ సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి ప్రొఫెషనల్‌ కోర్సులు వరకూ అందిస్తున్నాయి. కొన్నింటిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఉన్నాయి. ఇవి పరిశ్రమ అనుభవాన్ని ఇచ్చే మార్గంగా నిలుస్తున్నాయి. అనేక ఏళ్లుగా మేకప్‌ రంగంలో మహిళలు ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, ఇటీవల పురుషులు కూడా ఈ రంగంలో సత్తా చాటుతున్నారు. ప్రత్యేకంగా సినిమా, ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో పురుష మేకప్‌ ఆరి్టస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. లింగపరమైన పరిమితులు లేకుండా, టాలెంట్‌కు గౌరవం దక్కే రంగంగా మేకప్‌ రంగం రూపుదిద్దుకుంటోంది. 

(చదవండి:  బ్యూటీకి కేరాఫ్‌గా భాగ్యనగరం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement