డాడీ అంత పాపులర్‌ కాదు కానీ.. ఫ్యాషన్‌ వరల్డ్‌లో స్పెషల్‌ లేడీ! | Meet Vijay Mallya daughter Jewellery Designer Laila Mallya success story | Sakshi
Sakshi News home page

డాడీ అంత పాపులర్‌ కాదు కానీ.. ఫ్యాషన్‌ వరల్డ్‌లో స్పెషల్‌ లేడీ!

Jun 7 2025 1:25 PM | Updated on Jun 7 2025 3:01 PM

Meet Vijay Mallya daughter Jewellery Designer Laila Mallya success story

భారతీయ బ్యాంకులకు వేలకోట్ల ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)  భారతదేశంలో సుపరిచితుడు. కింగ్‌ఫిషర్  బ్రాండ్‌, ఎయిర్‌లైన్స్‌,అందాల భామలతో కేలండర్లు, లగ్జరీ జీవనశైలి,  మనీలాండర్‌, ఆర్థిక నేరస్తుడు,  తాజాగా  ఐపీఎల్‌ ఇలా ఏదో కారణంతో నిరంతరం వార్తల్లో ఉండే వ్యక్తి.  కానీ చాలా మందికి అతని వ్యక్తిగత జీవితం , అతని దత్తపుత్రిక ‘లైలా మాల్యా’  (Laila Mallya) గురించి పెద్దగా తెలియదు. తండ్రిలా వార్తల్లో ఉండే వ్యాక్తిలా కాకుండా  ప్రశాంతంగా ప్రైవేట్ జీవితాన్ని గడుపుతూ ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది.

విజయ్ మాల్యాకు లియానా, తాన్య, లైలా అనే ముగ్గురు కూతుళ్లున్నారు.  అయితే మాల్యాకు  దత్తత కూతురు.  తన మొదటి భార్య సమీరాతో విడిపోయిన తర్వాత 1993లో చిన్ననాటి ప్రేమికురాలు రేఖను వివాహం చేసుకున్నాడు  మాల్యా.  రేఖ మొదటి భర్త మెహమూద్‌తో    విడాకులు,   తనతో వివాహం తర్వాత చట్టబద్ధంగా లైలాను తన కుమార్తెగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  అలా మాల్యా కుటుంబంలో భాగమైంది. 'మాల్యా' నుతన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె తండ్రి జీవితం నిరంతరం మీడియాలో హెడ్‌లైన్‌గా మారినప్పటికీ, లైలా తన చదువుపై దృష్టి పెట్టింది. విజయ్‌ పిల్లల్ని తన సొంత చెల్లెళ్లలా చూసుకుంది. తల్లిరేఖకు మునుపటి వివాహం నుండి ఒక అన్నయ్య కబీర్ కూడా ఉన్నాడు.

2011లో, లైలా మాల్యా  ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సమర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో వీరి పెళ్లి జరిగింది. లైలా భర్త సమర్ సింగ్, శరద్ పవార్ మనవడు, రాజకీయ నాయకుడు పార్థ్ పవార్‌కు మంచి స్నేహితుడు. 2019లో, సమర్ లోక్‌సభ ఎన్నికల మార్కెటింగ్ ప్రచారంలో పార్థ్‌కు  క్యాంపెయిన్‌ కూడా చేశాడు.


లైలా చదువు, కరియర్‌
లైలా కర్ణాటకలోని బెంగళూరులోని మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత,  మసాచుసెట్స్‌లోని వాల్తామ్‌లోని బెంట్లీ యూనివర్సిటీలోఇంటర్నేషనల్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ , ఆ తరువాత న్యూయార్క్ నగరంలోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కూడా  పూర్తి  చేసింది. 2009లో, ఆమె IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసింది, క్రీడలు , ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పై తొలి అడుగు వేసింది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు.  తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.ఆభరణాల లేబుల్, సోషల్ బటర్‌ఫ్లైని ప్రారంభించింది. ఆభరణాల డిజైన్‌లో ప్రతిభను చాటుకుంటోంది 2015 నాటికి  వోగ్ బ్రాండ్  జ్యువెలరీ డిజైనర్, స్టైలిస్ట్‌గా   ఎదిగింది.  లైలా ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా  అనేక ఫ్యాషన్ వీక్ షోలలో కూడా పాల్గొంది.  లైలా మాల్యా తన తండ్రి అంత పాపులర్‌ కాకపోవచ్చు. కానీ ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని కెరీర్‌ను నిర్మించుకున్న ఇండిపెండెంట్‌ మహిళ అనడంలో సందేహం లేదు. 

Advertisement
 
Advertisement
Advertisement