breaking news
Jewellery Designs
-
డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్‌లో స్పెషల్ లేడీ!
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా(Vijay Mallya) భారతదేశంలో సుపరిచితుడు. కింగ్‌ఫిషర్ బ్రాండ్, ఎయిర్‌లైన్స్,అందాల భామలతో కేలండర్లు, లగ్జరీ జీవనశైలి, మనీలాండర్, ఆర్థిక నేరస్తుడు, తాజాగా ఐపీఎల్ ఇలా ఏదో కారణంతో నిరంతరం వార్తల్లో ఉండే వ్యక్తి. కానీ చాలా మందికి అతని వ్యక్తిగత జీవితం , అతని దత్తపుత్రిక ‘లైలా మాల్యా’ (Laila Mallya) గురించి పెద్దగా తెలియదు. తండ్రిలా వార్తల్లో ఉండే వ్యాక్తిలా కాకుండా ప్రశాంతంగా ప్రైవేట్ జీవితాన్ని గడుపుతూ ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది.విజయ్ మాల్యాకు లియానా, తాన్య, లైలా అనే ముగ్గురు కూతుళ్లున్నారు. అయితే మాల్యాకు దత్తత కూతురు. తన మొదటి భార్య సమీరాతో విడిపోయిన తర్వాత 1993లో చిన్ననాటి ప్రేమికురాలు రేఖను వివాహం చేసుకున్నాడు మాల్యా. రేఖ మొదటి భర్త మెహమూద్తో విడాకులు, తనతో వివాహం తర్వాత చట్టబద్ధంగా లైలాను తన కుమార్తెగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా మాల్యా కుటుంబంలో భాగమైంది. 'మాల్యా' నుతన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె తండ్రి జీవితం నిరంతరం మీడియాలో హెడ్‌లైన్‌గా మారినప్పటికీ, లైలా తన చదువుపై దృష్టి పెట్టింది. విజయ్ పిల్లల్ని తన సొంత చెల్లెళ్లలా చూసుకుంది. తల్లిరేఖకు మునుపటి వివాహం నుండి ఒక అన్నయ్య కబీర్ కూడా ఉన్నాడు.2011లో, లైలా మాల్యా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సమర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో వీరి పెళ్లి జరిగింది. లైలా భర్త సమర్ సింగ్, శరద్ పవార్ మనవడు, రాజకీయ నాయకుడు పార్థ్ పవార్‌కు మంచి స్నేహితుడు. 2019లో, సమర్ లోక్‌సభ ఎన్నికల మార్కెటింగ్ ప్రచారంలో పార్థ్‌కు క్యాంపెయిన్ కూడా చేశాడు.లైలా చదువు, కరియర్లైలా కర్ణాటకలోని బెంగళూరులోని మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, మసాచుసెట్స్‌లోని వాల్తామ్‌లోని బెంట్లీ యూనివర్సిటీలోఇంటర్నేషనల్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ , ఆ తరువాత న్యూయార్క్ నగరంలోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కూడా పూర్తి చేసింది. 2009లో, ఆమె IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసింది, క్రీడలు , ఈవెంట్ మేనేజ్మెంట్పై తొలి అడుగు వేసింది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.ఆభరణాల లేబుల్, సోషల్ బటర్‌ఫ్లైని ప్రారంభించింది. ఆభరణాల డిజైన్‌లో ప్రతిభను చాటుకుంటోంది 2015 నాటికి వోగ్ బ్రాండ్ జ్యువెలరీ డిజైనర్, స్టైలిస్ట్‌గా ఎదిగింది. లైలా ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా అనేక ఫ్యాషన్ వీక్ షోలలో కూడా పాల్గొంది. లైలా మాల్యా తన తండ్రి అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని కెరీర్‌ను నిర్మించుకున్న ఇండిపెండెంట్ మహిళ అనడంలో సందేహం లేదు. -
ఆ... భరణం అచ్చం అలాగే!
సినిమా తారలు ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వారు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను అంతా ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. అత్యంత ఖరీదైన ఆ డ్రెస్సులు, ఆభరణాలు వారిని మరింత ప్రత్యేకంగా చూపుతుంటాయి. యునిక్‌గా కనిపించే వాటిని అచ్చం అలాగే తయారు చేయించుకోవడమే కాదు మార్కెట్లోనూ ఆ రెప్లికా డిజైన్స్ లభిస్తుంటాయి. ఆభరణాలలో కనిపించే ఈ ట్రెండ్స్ వివాహ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురువారం తన సోదరుడు సిద్ధార్థ్ మెహందీ వేడుకలో పది కోట్ల రూపాయలకు పైగా విలువైన బల్లారి నెక్లెస్‌ను ధరించి, అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ మధ్య నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలో కోట్ల ఖరీదైన పచ్చల హారాన్ని ధరించింది.వేడుకలలో స్టార్ సెలబ్రిటీలు ధరించే జ్యువెలరీ ధర కోట్లలో ఉంటుంది. అంత ఖరీదు మనం పెట్టలేం, అలాంటి డిజైన్ని పొందలేం అని ఈ రోజుల్లో వెనకంజ వేయనక్కర్లేదు. కొన్ని రోజులలోనే అలాంటి డిజైన్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలు ధరించిన ఆభరణాల రెప్లికా డిజైన్స్ రూ.1500 నుంచి పది వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) మెరుపు తగ్గకుండా! ఇమిటేషన్, వన్‌గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్.. ఆభరణాలను కొత్తగా ఉంచడానికి వాటిని శుభ్రంగా ఉంచాలి. ఆభరణాన్ని వాడిన ప్రతిసారి మృదువైన, పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి. దీనివల్ల మురికి, చెమట తొలగిపోతాయి ఆభరణాల నాణ్యతను కాపాడుకోవడానికి సరైన విధంగా భద్రపరచుకోవాలి. తక్కువ ఖరీదు అనో, టైమ్ లేదనో.. అన్నింటినీ ఒకే బాక్స్‌లో పెట్టేస్తుంటారు. బీడ్స్, స్టోన్స్‌పై గీతలు పడకుండా, పాడవకుండా ఉండాలంటే ప్రతి ఆభరణాన్ని ప్రత్యేక కంపార్ట్మెంట్లలో ఉంచాలి ఏ కాస్త తేమ ఉన్నా ఆభరణాల రంగు మారుతుంది. ఆభరణాలను ఉంచే పెట్టెలో అదనపు తేమను గ్రహించడానికి మీరు సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించవచ్చు పెర్ఫ్యూమ్లు, లోషన్లు ఉపయోగించిన తర్వాతనే ఆభరణాలను అలంకరించుకోవాలి. లేదంటే వాటిలోని రసాయనాలు ఆభరణాలను మసకబారిస్తాయి ∙ఆర్టిఫిషియల్ ఆభరణాలలో ఒకేరకాన్ని తరచూ ధరించకూడదు. దీనివల్ల ఆ ఆభరణం త్వరగా రంగుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఆభరణాలలో ఏదైనా నష్టం గమనించినట్లయితే, వెంటనే మరమ్మతు చేయించాలి. వదులుగా ఉన్న రాళ్ళు లేదా విరిగిన వాటిని సకాలంలో గమనించినట్లయితే సులభంగా మరమ్మతు చేయవచ్చు. ఈ ఆభరణాలను బాగు చేసే షాపులు కూడా ఉంటాయి. వాటి ద్వారా నగను మరో రూపంగా కూడా మార్చుకోవచ్చు.బీడ్స్ .. చోకర్స్ఇప్పుడు వివాహ వేడుకలలో ట్రెండ్‌లో ఉన్నవి బీడ్స్, చోకర్స్. అన్నిరకాల బీడ్స్ లేయర్లుగా ఉన్నవి బాగా ఇష్టపడుతున్నారు. శారీ, డ్రెస్ కలర్‌కు మ్యాచింగ్ బీడ్స్ హారాలు, చోకర్స్ బాగా నప్పుతుంటాయి. వీటికి గోల్డెన్ బాల్స్, స్టోన్స్ లాకెట్స్ జత చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. వేడుకలలో ఆకర్షణీయంగా కనిపించాలి, ఫొటో, వీడియోలలో అందంగా కనిపించాలనుకునేవారు వీటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. బంగారం ధరలు బాగా పెరిగిపోవడం, ప్రతీ వేడుకకు కొత్త హారం కావాలనుకోవడం వల్ల కూడా ఇలాంటివాటికి బాగా డిమాండ్ ఉంటోంది.ఫోటో సెండ్ చేస్తే... ఆభరణం తయారీ..ఎంత గ్రాండ్ డిజైన్ అయినా, సెలబ్రిటీలు వేసుకున్న ఆభరణాలైనా.. నచ్చిన డిజైన్ ఫోన్లో ఫోట్ సేవ్ చేసుకొని, మాకు ఇస్తే ఆర్డర్ మీద ఆ డిజైన్ని తయారుచేసి ఇస్తుంటాం. వివాహ వేడుకలలో హైలైట్‌గా నిలిచే రెప్లికా డిజైన్స్, బీడ్ జ్యువెలరీని మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నాం. స్టోన్స్, బీడ్స్, వడ్డాణం, చేతి పట్టీలూ.. పూర్తి సెట్ వారి పెళ్లి శారీ కలర్ కాంబినేషన్ బట్టి తయారుచేయించుకుంటున్నారు. సంప్రదాయ వేడుకలలో ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ ఎంపికే ముందు వరసలో ఉంటుంది. – ఎల్.పద్మ, ఇమిటేషన్ జ్యువెలరీ మేకర్, హైదరాబాద్ (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
లవ్ అండ్ ఎమోషన్స్ : మగువల మనసు దోచే రత్నాభరణాలు (ఫొటోలు)
-
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)