ప్రియుడికి టాటా చెప్పేశాక..సర్‌ప్రైజ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్‌ బ్యూటీ | Malaika Arora shares glimpse her luxuriousrestaurant | Sakshi
Sakshi News home page

ప్రియుడికి టాటా చెప్పేశాక..సర్‌ప్రైజ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్‌ బ్యూటీ

Jan 8 2025 4:22 PM | Updated on Jan 8 2025 5:14 PM

Malaika Arora shares  glimpse her luxuriousrestaurant

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌, తనదైన  లుక్స్‌,  నటనతో ఆకట్టుకుంది.    19 ఏళ్ల వివాహ జీవితం, కుమారుడు తర్వాత  భర్త అర్బాజ్ ఖాన్‌నుంచి విడిపోయింది. ఆ తరువాత 2018 నుంచి అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. 2024లో విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. ఇటీవలే మలైకా తండ్రి కన్నుమూశారు.  ప్రస్తుతం కుమారుడు అర్హాన్‌తో కలిసి జీవిస్తోంది. 

మలైకా అరోరా  ఒక కొత్త రెస్టారెంట్‌ ప్రారంభించింన సంగతి తెలిసిందే. ప్రియుడితో బ్రేకప్‌ ప్రకటించిన తరువాత ఇపుడు అధికారికంగా ఈ రెస్టారెంట్‌ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.  దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఫుడ్‌ విశేషాలను ఇందులో షేర్‌ చేసింది. సర్‌ప్రైజ్‌ కూడా ఉంది అంటూఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. మలైకా లేటెస్ట్‌ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. దీంతో ముంబైలో రెస్టారెంట్‌ను ప్రారంభించిన తాజా సెలబ్రిటీగా మలైకా అరోరా నిలిచింది.

 ‘స్కార్లెట్ హౌస్‌కి స్వాగతం. సరే, ఇది మా రిటైల్‌ రూం. ,ఇది రాత్రికి వైన్, టేస్టింగ్ కమ్యూనిటీ బార్‌గా మారుతుంది. ఇది పర్ఫెక్ట్ సెట్టింగ్.. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒకటి తయారవుతూనే ఉంటుంది... అంటూ   మలైకా తన పోస్ట్‌లో తెలిపింది.

దీపికా స్టైలిష్‌ డ్రెస్‌, చూడ్డానికి చాలా సింపుల్‌ : కానీ ధర తెలిస్తే షాక్‌!


 

 

ముంబైలోని బాంద్రాలో కొలువుదీరిన ఈ రెస్టారెంట్‌కు స్కార్‌లెట్‌ హౌస్‌ అని పేరు పెట్టారు. 90 ఏళ్ల క్రితం నాటి పోర్చుగీస్‌  బంగ్లాను వింటేజ్‌ లుక్‌ తీసుకొచ్చి రెస్టారెంట్‌గాతీర్చిద్దింది. . తన చిన్ననాటి స్నేహితుడు మలయ నాగ్‌పాల్‌, రెస్టారెంట్‌ నడిపే ధవల్‌ ఉదేషితో కలిసి ఈ ఫుడ్‌ బిజినెస్‌ను మొదలు పెట్టింది. స్కార్లెట్ హౌస్ అద్భుతమైన ఇంటీరియర్స్ , విలాసవంతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో దీన్ని రూపొందించారట. 

 

ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement