‘సారీ’ చెప్తారా? ఎదుగుతారా? | Sakshi
Sakshi News home page

‘సారీ’ చెప్తారా? ఎదుగుతారా?

Published Wed, Feb 21 2024 10:13 AM

The Importance Of Saying Sorry - Sakshi

‘ఐయాం సారీ’... 
తప్పులు, పోరపాట్లు  చేసి సారీ చెప్పడం అందరూ చేసే పని. కాని జీవితంలో ‘సారీ’లు కొనసాగుతూ ఉంటే మనం ఇంకా ఎదగలేదని, తప్పుల నుంచి నేర్చుకోవడం లేదని అర్థమంటారు ప్రియా కుమార్‌.‘అలవాటుగా తప్పు చేయడం  దుర్లక్షణం’ అనే ప్రియా కుమార్‌ తనవైన సూత్రీకరణలతో మోటివేషనల్‌ స్పీకర్‌గా మారారు. పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌ రచనలు చేస్తూనే దేశంలో టాప్‌ 10 మహిళా వ్యక్తిత్వ వికాస నిపుణులలో ఒకరిగా ఎదిగారు. విజయానికి ఆమె చెప్తున్న సూత్రాలు.

‘నెగెటివ్‌ థింకింగ్‌ ఉన్నవాళ్లు సమస్యలను ఊహించుకుంటూ భయపడుతుంటారు. వాళ్లు ఊహించి ఎదురు చూసే సమస్యలు చాలామటుకు ఎదురుపడవు. కాని ఇలా నెగెటివ్‌ థింకింగ్‌ వల్ల నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కొందాం అనే కుతూహలం నశిస్తుంది. సమస్య మీద ఫోకస్‌ నిలువదు. సమస్యను పరిష్కరించాల్సింది ΄ో  దాని వల్ల నష్టపోతారు’ అంటుంది ప్రియా కుమార్‌. ఈమెది చండీగఢ్‌.47 ప్రపంచ దేశాలలో ప్రియా కుమార్‌ కార్పొరేట్‌ సంస్థలకు మోటివేషనల్‌ స్పీకర్‌గా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆమె రాసిన 12 పుస్తకాలు అంతర్జాతీయ అవార్డులను ΄చెందాయి. బయోగ్రఫీలు రాయడం మరో ఆసక్తిగా కలిగిన ప్రియా కుమార్‌ తాజాగా పుల్లెల గోపీచంద్‌ బయోగ్రఫీ ‘షట్లర్స్‌ ఫ్లిక్‌’ను వెలువరించిచారు. డ్రీమ్, డేర్, డెలివర్‌ అనేది ఆమె నినాదం. 

ఇలా గెలవండి: ఒక వ్యక్తి కెరీర్‌ సఫలం కావాలంటే అతని కుటుంబ జీవనం సరిగ్గా ఉండాలని అంటుంది ప్రియా. ‘మీరు ఇల్లు విడిచి ఆఫీసుకు వస్తారు. మీరు విడిచి వచ్చిన ఇల్లు తిరిగి మీరు చేరే సమయానికి మీకు ఆహ్వానం పలికేలా ఉండాలి. అది మీ బడలిక తీర్చి మరుసటి రోజు మిమ్మల్ని కార్యోన్ముఖులను చేసేదిగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఇంటిని, ఆఫీసును వేరు చేయకూడదు. అంటే మీ పనిలో ఏం జరుగుతున్నదో, మీరేం చేస్తున్నారో, మీరు ఎక్కడకు వెళుతున్నారో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో కొద్దిగా అయినా ఇంటి సభ్యులకు తెలియచేయాలి.

ఒక్కమాటలో చె΄్పాలంటే మీ పనిని మీ ఇంటి సభ్యులతో జత చేయాలి. అప్పుడే వారు మీ ఉద్యోగ జీవితాన్ని సరిగా అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు’ అంటుందామె. ‘ఒక ఉద్యోగంలో మీరు చేరితే జీవితాంతం ఆ ఉద్యోగం చేయాలని లేదు. అక్కడ కొందరు రాజకీయాలు చేసి మీరు పని చేయలేని స్థితి వస్తే అలాంటి టాక్సిక్‌ వాతావరణం నుంచి బయటపడేయడానికి వారు మీకు సాయం చేస్తున్నారని అర్థం. అక్కడి నుంచి బయటపడి కొత్త జీవనాన్ని మొదలెట్టండి. మీకు ఉద్యోగం మీ సామర్థ్యాన్ని చూసి ఇస్తారు. మీరు ఉద్యోగంలో ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఈ సామర్థ్యానికి– దాని ప్రదర్శనకు మధ్య ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడంలోనే మీ విజయం ఆధారపడి ఉంది’ అని తెలుపుతుంది ప్రియ కుమార్‌.

సారీలు మానండి:
‘జీవితంలో ఏదో ఒక దశలో సారీలు చెప్పలేని స్థితికి చేరుకోవాలి. సారీ చెప్తున్నామంటే ΄÷ర΄ాటో, త΄్పో చేస్తున్నామని అర్థం. చేసిన తప్పుల నుంచి ΄ాఠాలు నేర్చుకుని ఎదగలేక΄ోవడం వల్ల మళ్లీ మళ్లీ సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ చెయవచ్చా. కాని దానినొక అలవాటుగా చేసుకుని అలాగే నెట్టుకొద్దామంటే ముందుకు పోలేరు’ అంటుంది ప్రియ కుమార్‌. ‘మీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారంటే మీరు వారి నుంచి మంచి ఆశించి, వారితో మంచిగా వ్యవహరిస్తున్నారని అర్థం. అలాగే మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే వారిలోని మంచి కాకుండా చెడు బయటకు వచ్చేలా వారితో మీరు వ్యవహరిస్తున్నారని అర్థం’ 

అంటుందామె. ‘కొందరు సమస్యలను 
ఆహ్వానించడమే పనిగా పెట్టుకుంటారు. లేదా సమస్యలను సృష్టిస్తారు. మీలోని సామర్థ్యాలను గుర్తించి వాటి కోసం మీ శక్తిని ΄పాజిటివ్‌గా ఉపయోగిస్తే సమస్యల్లో కాకుండా విజయాలలో ఉంటారు’ అని గెలుపు సూత్రాలు తెలుపుతోందామె. 

Advertisement
Advertisement