చెఫ్ వికాస్ ఖన్నా పరిచయం అక్కర్లేని ప్రముఖ చెఫ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సెలబ్రిటీ చెఫ్. మిష్లన్ స్టార్ పొందిన రెస్టారెంట్ యజమాని, వంట పుస్తకాల రచయిత, చిత్ర నిర్మాత, మాస్టర్ చెఫ్ ఇండియా షో న్యాయనిర్ణేతలో ఒకరు కూడా. పంజాబ్‌లో అమృత్‌సర్‌కి చెందని అతను అమెరికాలో చిన్న రెస్టారెంట్ నడుపుతూ చెఫ్‌గా సాగిన ప్రయాణం.. ఒక్కరాత్రిలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌గా పేరుతెచ్చుకునే స్థాయికి చేరుకున్నాడు. ఏకంగా అమెరికాలో ప్రముఖ టెలివిజన్ సిరీస్ 'కిచెన్ నైట్మేర్స్' పాల్గొనే అవకాశం దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. అలా ఈ భారత సంతతి చెఫ్ పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది. ఇలా తాను సెలబ్రిటీ చెఫ్‌గా మారిన విధం గురించి ఒకపాడ్‌కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక కస్టమర్‌తో జరిగిన పరిచయం రాత్రికి రాత్రే తన తలరాతను ఎలా మార్చిందో షేర్ చేసుకున్నారు.
అతడు భారత్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన వెంటనే యూఎస్‌లోని క్యులినరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా అనే న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుని అభ్యసించాడు. ఆ తర్వాత న్యూయార్క్ నగరంలోనే చిన్న రెస్టారెంట్ పనిచేస్తూ సమస్తం నిర్వహించేవాడు. దాన్ని నిలదొక్కుకునేలా చేసేందుకు శతవిధాల కష్టపడుతుండేవాడు. అనుకోకుండా ఒక రోజు ఒక మహిళా కస్టమర్ వికాస్ ఖన్నా రెస్టారెంట్‌కి వచ్చి ఊతప్పం ఆస్వాదిస్తుంది. అప్పడు వికాస్‌ని గమనించింది.
అతడు క్యాష్ రిజిస్టర్‌ను నిర్వహిస్తూ..వంట చేస్తూ..కస్టమర్లకు వడ్డిస్తూ..ఇలా సమస్తం తానే చేస్తూ కష్టపడుతున్న తనను చూసి మాటలు కదిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె తనను చెఫ్ గోర్డాన్ రామ్సేకి సిఫార్సు చేస్తూ, 'మనం ఇతన్ని ఒక ఎపిసోడ్ కోసం కిచెన్ నైట్‌మేర్స్‌కు తీసుకురావాలి' అని చెప్పింది. దాతో వాళ్లు తనను కన్సల్టెంట్‌గా తీసుకున్నారని చెప్పారు. అలా 2007లో, న్యూయార్క్ నగరంలోని నష్టాల్లో ఉన్న డిలోన్స్ అనే భారతీయ రెస్టారెంట్‌కు కన్సల్టెంట్‌గా ఖన్నా కిచెన్ నైట్‌మేర్స్ మొదటి సీజన్‌లో కనిపించాడు.
మెనూను పునఃరూపకల్పన చేయడానికి, రెస్టారెంట్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి గోర్డాన్ రామసే అతని సహాయం కోరారు. ఖన్నా భారతీయ వంటకాలకు సరికొత్త, సమకాలీన విధానాన్ని పరిచయం చేసి, ఆ రెస్టారెంట్‌ని రూపాంతరం చెందడానికి సహాయపడ్డాడు. ఆ రెస్టారెంట్‌కు తరువాత పూర్ణిమ అని పేరు మార్చారు. ఆ ఎపిసోడ్‌ను అమెరికా మొత్తం చూసింది. దాంతో యావత్తు ప్రపంచం దృష్టిలో పడ్డాడు వికాస్ ఖన్నా.
అలా తను సెబ్రిటీ చెఫ్‌గా మారినట్లు చెప్పుకొచ్చారు. తాను అమెరికాకు కేవంల రూ. 200 రూపాలయతో వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో వివరించాడు. నిరాశ్రయత, జాత్యహంకారం, ఆర్థిక ఇబ్బందులు ఇలా అన్నింటిని భరిస్తూ.. 30కి పైగా చిన్నా చితకా పనులు చేసినట్లు తెలిపాడు. ఒకానొక సమయంలో, అతను న్యూయార్క్ రెస్క్యూ మిషన్‌లో వారాల తరబడి నిద్రపోయానని చెప్పుకొచ్చాడు.
అతడు సాధించిన విజయాలు..
మాన్‌హాటన్‌లో 'జూనూన్'ను ప్రారంభించినప్పుడు తన అదృష్టం మారింది, అది ప్రారంభించిన కొన్ని నెలల్లోనే మిషెలిన్ స్టార్‌ను సంపాదించింది. 2024లో,న్యూయార్క్‌లోని ఈస్ట్ విలేజ్‌లో 'బంగళా'ను ప్రారంభించాడు, ఈ రెస్టారెంట్ త్వరగా విమర్శకుల ప్రశంసలను పొందింది, ఇందులో 'ది న్యూయార్క్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మకమైన త్రీ-స్టార్ సమీక్ష , మిషెలిన్ బిబ్ గౌర్మాండ్ గుర్తింపు కూడా ఉన్నాయి.
అలా వికాస్ ఖన్నా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే టైమ్ 100 జాబితాలో సైతం చోటు దక్కించుకున్నారు. అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025'గా గౌరవించింది.
(చదవండి: శాటిన్ హాల్టర్ డ్రెస్‌లో పుత్తడి బొమ్మలా ప్రియాంక చోప్రా..! అద్భుతమైన ఫ్యాషన్ పాఠం)


