చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్‌ ఎట్రాక్షన్ | Hina Khan wedding with boyfriend celebrity mehendi artist 'Henna' goes viral | Sakshi
Sakshi News home page

చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్‌ ఎట్రాక్షన్

Jun 5 2025 11:10 AM | Updated on Jun 5 2025 3:00 PM

Hina Khan wedding with boyfriend celebrity mehendi artist 'Henna' goes viral

ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్‌బారిన పడి  కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్‌ ఫ్రెండ్‌ రాకీ జైస్వాల్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.   బ్రైడల్‌ లుక్‌లో  తన అభిమానులకు  సరప్రెజ్‌  ఇచ్చింది.  దీంతో   అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్‌బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు.

హీనా తన డ్రీమీ వెడ్డింగ్‌ గురించి ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్‌ కుర్తాలో  వరుడు రాకీ అందంగా  కనిపించారు. తన అభిమానులకు హాయ్‌ చెబుతూ ఒక వీడియోను కూడా  రిలీజ్‌ చేసింది.

అలాగే  సెలబ్రిటీ మెహిందీ డిజైనర్‌ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్‌  ఎట్రాక్షన్‌గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్‌ వావ్‌ అంటున్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. 

చక్కటి మెహందీ డిజైన్స్‌ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది.  సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్‌ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్‌ డిజైన్‌సహా ఆమె డిజైన్స్‌ ట్రెండ్‌గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్‌ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు.

p;

 

Advertisement
 
Advertisement
Advertisement