శాకాహరం అందించే కేఎఫ్‌సీ గురించి తెలుసా..! | Harsh Goenka Shares KFC Which Serves Only Vegetarian Food | Sakshi
Sakshi News home page

శాకాహరం అందించే కేఎఫ్‌సీ గురించి తెలుసా..!

Oct 7 2026 4:44 PM | Updated on Oct 7 2026 5:18 PM

Harsh Goenka Shares KFC Which Serves Only Vegetarian Food

కేఎఫ్‌సీ అనగానే నోరూరించే ఫ్రైడ్‌ చికెన్‌ పీస్‌లు గుర్తొస్తాయి. ఈ అమెరికన్‌ ఫుడ్‌ బ్రాండ్‌ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 దేశాల్లోని ప్రాంతాల్లో సర్వీస్‌ అందిస్తోంది. అయితే అహ్మదాబాద్ సమీపంలోని ఒక ప్రత్యేకమైన కేఎఫ్‌సీ కేవలం శాకాహార భోజనం మాత్రమే అందిస్తుంది. దీని గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకాఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు పోస్ట్‌లో. 

ఇది శాకాహార భోజనం మాత్రమే లభించే కేఎఫ్‌సీ ఫుడ్‌కోర్ట్‌.  గోయెంకా షేర్‌ చేసిన పోటోల సైన్‌బోర్డుపై చూడముచ్చటి శ్రీకృష్ణుని చిత్రం కూడా ఉంది. ప్రధాన బోర్డు కింగ..ఆ ఫుడ్‌ కోర్టులో పనిచేస్తున్న టీటైమ్‌, బాంబే పావ్‌ భాజీ, కృష్ణ ఇన్‌ వంటి ఆహార సంస్థల పేర్లను కూడా చూడొచ్చు. 

కాగా, ఈ ఫుడ్‌ కోర్టు ఉచిత పార్కింగ్‌ సౌకర్యం తోపాటు సౌకర్యవంతమైన ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, శుభ్రమైన వాష్‌రూమ్‌లను అందిస్తుండటం విశేషం. గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌ సమీపంలో షామ్లాజీ అహ్మదాబాద్‌ హైవేపై ఈ శ్రీకృష్ణ ఫుడ్‌కోర్టు ఉందట. నెటిజన్లు ఇది చికెన్‌ లేని కేఎఫ్‌సీనా అని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు.

 

ఇదీ చదవండి: రైతుగా సివిల్‌ ఇంజనీర్‌..! అరటిపండ్లతో ఏకంగా రూ. 35 లక్షలు..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement